Credit Card: ఒక్కొక్కరి దగ్గర ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే క్రెడిట్ కార్డులను పక్కవారి ఇచ్చే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. అయితే దీనివల్ల ఇబ్బందులు తప్పవని అంటున్నారు నిపుణులు.
స్నేహితుల అవసరాల కోసం తమ క్రెడిట్ కార్డ్ ఉపయోగించడం చాలామందికి సాధారణమే. కానీ ఇలా చేయడం వల్ల తెలియకుండానే ఆదాయపు పన్ను సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఖర్చులు కనిపించి, వాటికి తగిన ఆదాయం చూపించకపోతే ఐటీ శాఖ నోటీసులు పంపించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
25
వైరల్ అవుతోన్న ఘటన
ఇటీవల సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ఓ ఘటన ప్రకారం, ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. కానీ అతను ఇప్పటివరకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా దాఖలు చేయలేదు. విచారణలో తెలిసింది ఏమిటంటే, తన స్నేహితుల ఖర్చులు కూడా అతనే కార్డ్‌తో చెల్లించేవాడు. రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ కోసం ఇలా చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది.
35
క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై పెరిగిన నిఘా
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఐటీ శాఖ పర్యవేక్షణ మరింత కఠినమైంది. సాధారణంగా షాపింగ్‌పై వచ్చే రివార్డ్స్‌కు పన్ను ఉండదు. కానీ ఆ రివార్డ్స్‌ను నగదుగా మార్చి, ఏడాదిలో రూ.50,000 మించితే, అది పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. స్టేట్‌మెంట్‌లో భారీ క్యాష్‌బ్యాక్‌లు కనిపిస్తే అవి కూడా సమస్యగా మారవచ్చు.
ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 285BA ప్రకారం, ఏడాదిలో రూ.10 లక్షలు మించిన లావాదేవీల వివరాలను బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఐటీ శాఖకు పంపాలి. ఇందులో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులు కూడా ఉంటాయి. ఖర్చు ఎవరి కోసం చేసినా, అది మీ PAN నంబర్‌తోనే రికార్డ్ అవుతుంది. ఖర్చు చేసిన ఆ మొత్తానికి సంబంధించిన ఆదాయాన్ని మీరు నిరూపించకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
55
సెక్షన్ 69C ఎప్పుడు వర్తిస్తుంది?
మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులు మీరు ప్రకటించిన ఆదాయానికి సరిపోకపోతే, ఐటీ శాఖ సెక్షన్ 69Cను వర్తింపజేయవచ్చు. అంటే ఆ ఖర్చును మీ ఆదాయంగా పరిగణించి పన్ను వేస్తారు. మొదట్లో ఉపశమనం దొరకడం కష్టం. చాలాసార్లు ఈ కేసులు ట్రిబ్యునల్ వరకూ వెళ్తాయి. కాబట్టి స్నేహితుల కోసం చెల్లింపులు చేస్తే ప్రతి లావాదేవీకి సరైన ఆధారాలు ఉండాలి. స్నేహితులు నగదు ఇస్తే ఆధారం ఉండదు. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, బిల్లులు, రీయింబర్స్‌మెంట్ రికార్డులు తప్పనిసరి. లేకపోతే “ఇది నా ఖర్చు కాదు” అని చెప్పడానికి సాక్ష్యాలు ఉండవని గుర్తించాలి.