వెండి కొనడం ఆలస్యమైందని బాధపడుతున్నారా.? ఏం బాధ‌ప‌డ‌కండి, అస‌లు క‌థ ముందుంది

Published : Dec 28, 2025, 01:10 PM IST

Silver Price: వెండి ధ‌ర‌లు అంచ‌నాల‌కు మించి పెరుగుతున్నాయి. భారీగా పెరిగిన ధ‌ర‌ల‌తో వెండి కొన‌లాంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అయితే వెండికి సంబంధించి ప్ర‌ముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

PREV
15
వెండి ధరల దూకుడు..

ఇటీవల వెండి ధరలు అంచనాలకు మించి పెరుగుతున్నాయి. రోజురోజుకీ కొత్త రికార్డులు నమోదవుతుండటంతో పెట్టుబడిదారుల దృష్టి మొత్తం వెండిపై పడింది. ఈ పెరుగుదల కొనసాగుతుందా, లేక కొంతకాలం సర్దుబాటు వస్తుందా అన్న అంశంపై మార్కెట్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

25
రాబర్ట్ కియోసాకి ఆస‌క్తిక‌ర ట్వీట్

బంగారం, వెండి వంటి లోహాలే నిజమైన ఆస్తులు అని ఎప్పటి నుంచో చెబుతున్న ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి, తాజాగా వెండి ధరలపై వరుసగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ప్రస్తుతం వెండి ఔన్స్‌కు 70 డాలర్లను దాటిన వేళ, ఇంకా పెట్టుబడి పెట్టాలా లేదా ఆలస్యం అయిందా అనే సందేహాలపై ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

35
ఇప్పుడే అసలు ప్రయాణం ప్రారంభం

ప్రస్తుతం ఉన్న వెండి ధరే గరిష్ఠ స్థాయి అని భావించడం పెద్ద పొరపాటు అవుతుందని కియోసాకి హెచ్చరించారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, అసలైన దూకుడు ఇంకా ముందుందని తెలిపారు. వెండి మార్కెట్‌లో పెద్ద ర్యాలీకి అవసరమైన పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్నాయని ఆయన అభిప్రాయం.

45
2026 నాటికి ఔన్స్‌కు 200 డాలర్లు?

రాబోయే కాలంలో వెండి ధరలు ఊహించని స్థాయికి చేరతాయని కియోసాకి అంచనా వేస్తున్నారు. తన అంచనాల ప్రకారం 2026 నాటికి వెండి ధర ఔన్స్‌కు 200 డాలర్లను దాటే అవకాశం ఉందని చెప్పారు. ఇది ఊహాగానం కాదని, ఇందుకు అనేక ఆర్థిక కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పెట్టుబడిదారులు కావాలంటే స్వయంగా సమాచారం సేకరించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

55
చిన్న మొత్తంతో మొదలు పెట్టండి

1965లో వెండి ధర ఔన్స్‌కు ఒక డాలర్ కూడా లేని రోజుల్లోనే తాను పెట్టుబడులు ప్రారంభించానని కియోసాకి గుర్తు చేశారు. ప్రస్తుతం ధరలు భారీగా పెరిగినా తాను వెండి కొనుగోళ్లు కొనసాగిస్తున్నానన్నారు. సంపద సాధనకు ఉత్తమ మార్గం స్వయంగా అధ్యయనం చేయడమేనని, చిన్న మొత్తాలతో ప్రారంభించినా అనుభవం సంపదకు దారి తీస్తుందని చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories