Cooler: స్లిమ్‌గా ఉంద‌ని సిల్లీగా చూడ‌కండి.. బ‌య‌ట ఎంత ఎండున్నా ఇంట్లో మంచు కుర‌వాల్సిందే

Published : Apr 16, 2026, 12:46 PM IST

Cooler: ఎండ‌లు దంచికొడుతున్నాయి. ఇంట్లో కూడా నిప్పుల కుంప‌టిలా మారుతోంది. దీంతో కూల‌ర్లు, ఏసీల వినియోగం పెరుగుతోంది. అయితే త‌క్కువ ధ‌ర‌లో ఏసీలాంటి కూలింగ్ ఇచ్చే ఒక బెస్ట్ ప్రొడ‌క్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
హ‌వెల్స్ కంపెనీ

హ‌వెల్స్ కంపెనీకి చెందిన హ‌వెల్స్ జూరి 60 లీట‌ర్ల ట‌వ‌ర్ ఎయిర్ కూల‌ర్ త‌క్కువ బ‌డ్జెట్‌లో బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. ఈ కూలర్ అసలు ధర అమెజాన్‌లో రూ. 23,790 కాగా, ప్రస్తుతం 50% డిస్కౌంట్‌తో రూ. 11,900కి అందుబాటులో ఉంది. ఇలాంటి ఆఫర్‌లో మంచి బ్రాండ్ కూలర్ తక్కువ ధరకు దొరకడం ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు.

25
డిజైన్, నిర్మాణం, సామర్థ్యం

ఈ టవర్ ఎయిర్ కూలర్ 60 లీటర్ల పెద్ద వాటర్ ట్యాంక్‌తో వస్తుంది. ఈ కూల‌ర్‌ను ఏబీఎస్‌, పాలీప్రొప్లైన్ మెటీరియ‌ల్‌తో త‌యారు చేశారు. బ్లాక్ అండ్‌ గ్రే క‌ల‌ర్స్‌లో ల‌భిస్తోంది. ఇక డైమెన్ష‌న్స్ విష‌యానికొస్తే 39.4 x 39.7 x 138.5 సెం.మీగా ఉంది. ఈ కూల‌ర్ 17.5 కిలోల బ‌రువు ఉంది. స్లిమ్ టవర్ లుక్ వల్ల ఇంట్లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.

35
కూలింగ్ పనితీరు, గాలి ప్రసరణ

ఈ కూలర్ గంటకు 350 CFM గాలి ప్రసరణ ఇస్తుంది. పెద్ద గదులకు సరిపోయేలా గాలి బాగా పంపిస్తుంది. వేడి ఎక్కువ‌గా ఉన్న వాతావ‌ర‌ణంలో కూడా చల్లని గాలిని అందిస్తుంది. హనీకాంబ్ ప్యాడ్స్ టెక్నాలజీ వల్ల గాలి చల్లగా, శుభ్రంగా ఉంటుంది. దీంతో 99.9% వరకు బ్యాక్టీరియా, అలెర్జెన్స్ తగ్గిస్తాయి.

45
ముఖ్యమైన ఫీచర్లు

ఈ కూలర్‌లో యూజర్‌కు ఉపయోగపడే ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. దూరం నుంచే ఆప‌రేట్ చేసుకునేందుకు వీలుగా రిమోట్ కంట్రోల్ అండ్‌ ఎలక్ట్రానిక్ ప్యానెల్‌ను అందించారు. కూల‌ర్‌లో నీరు త‌క్కువైతే అల‌ర్ట్ చేసేందుకు లో వాటర్ అలారాన్ని ఇచ్చారు. టైమర్ ఫంక్షన్ ద్వారా అవసరానికి అనుగుణంగా టైమ్ సెట్ చేసుకోవచ్చు 360 డిగ్రీల క్యాస్ట‌ర్ వీల్స్ స‌హాయంతో కూల‌ర్‌ను సులభంగా ఎక్కడికైనా మార్చుకోవచ్చు. డ్రై రన్ ప్రొటెక్షన్ ద్వారా నీరు లేకపోయినా మోటార్‌కు నష్టం కాకుండా కాపాడుతుంది. క‌రెంట్ పోయినా ఇన్వర్టర్‌తో ప‌ని చేస్తుంది.

55
సేఫ్టీతో పాటు అదనపు ప్రయోజనాలు

థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్‌తో మోటార్ ఓవర్ హీట్ అయితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. డస్ట్ ఫిల్టర్ నెట్ ద్వారా గాలి శుభ్రంగా ఉంటుంది. ఫుల్ కాలాప్సిబుల్ లూవర్స్ ద్వారా గాలి దిశను నియంత్రించవచ్చు. మొత్తం మీద ఈ టవర్ ఎయిర్ కూలర్ పెద్ద గదులకు సరిపోయే శక్తివంతమైన కూలింగ్, మంచి ఫీచర్లు, సేఫ్టీతో కూడిన పూర్తి ప్యాకేజ్ అన‌డంలో సందేహం లేదు.

Read more Photos on
click me!

Recommended Stories