Today Gold Rate: పెళ్లిళ్ల సీజన్‌లో భారంగా మారిన బంగారం..తులంపై రూ.3,110 పెరుగుదల

Published : Apr 16, 2026, 11:08 AM IST

Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. కొనాలి అనుకునే వాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఇంకా పెరుగుతాయా? లేక తగ్గుతాయా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

PREV
15
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం

అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, జియోపాలిటికల్ టెన్షన్స్, డాలర్ మార్పులు... ఇవి బంగారం రేట్లపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. సోమవారం నుంచి బంగారం ధరల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. రోజుకో రేటు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు.  

25
అదే స్థాయిలో లేని సరఫరా

ఇక మరో ముఖ్య కారణం..పెళ్లిళ్ల సీజన్. మన దేశంలో పెళ్లిళ్ల సమయంలో బంగారం డిమాండ్ భారీగా పెరుగుతుంది. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరగడం, సరఫరా అదే స్థాయిలో లేకపోవడం వల్ల ధరలు మరింత ఎగబాకుతున్నాయి. 

35
రూ.1,55,570కు చేరిన బంగారం

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ.1,55,570 వద్ద కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రూ.220 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే రూ.1,42,600 వద్ద ఉంది. రూ.200 పెరిగింది. మూడు రోజుల్లో  తులంపై రూ.3,110 పెరుగుదల నమోదైంది.

45
బంగారంతో పాటే వెండి

ఇక వెండి ధరలు కూడా బంగారంతో పాటే పెరుగుతున్నాయి. పారిశ్రామిక అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్ కారణంగా వెండి రేట్లు కూడా పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. దీంతో పెట్టుబడిదారులు కూడా వెండిపై దృష్టి పెడుతున్నారు. 

55
పెళ్లిళ్ల సీజన్‌లో భారంగా మారిన బంగారం

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు...అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పులు, ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్‌గా బంగారాన్ని ఎంచుకోవడం, పెళ్లిళ్ల సీజన్ కారణంగా డిమాండ్ పెరగడం.

ఇలాగే అంతర్జాతీయ పరిస్థితులు అస్థిరంగా కొనసాగితే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే కొంతకాలం తర్వాత స్థిరపడే అవకాశమూ ఉంది. అందుకే కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటం కొనుగోలుదారులకు షాక్ ఇస్తోంది. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది మరింత భారంగా మారుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories