Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త.. ఇకపై బేసిక్ శాలరీ రూ. 46 వేలు..

Published : Mar 07, 2025, 09:30 AM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ప్రధాని నరేంద్ర మోదీ 8వ వేతన సంఘం అమలుతో భారీ మొత్తం వారి ఖాతాల్లో జమ కానుంది! జీతాలు రూ.18,000 నుంచి రూ.46,260కి పెరగనున్నాయి! ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు వేగంగా పెరుగుతున్నాయి. 

PREV
19
Salary: ఉద్యోగులకు పండగలాంటి వార్త..  ఇకపై బేసిక్ శాలరీ రూ. 46 వేలు..

8వ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త వేతన స్కేలు అమలు చేయనున్న నేపథ్యంలో భారీగా జీతాలు పెరగనున్నాయి. దీంతో జీతాలు ఏమేర పెరగనున్నాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. 

29

జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (JCM) జాతీయ మండలి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన పెరుగుదలను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై దృష్టి పెడుతున్నారు. 

39

ఉద్యోగుల జీతం పెంపును నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఒక ముఖ్యమైన భాగం. JCM ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57కి పెంచాలని ప్రతిపాదించింది, ఇది 7వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో పోలిస్తే చాలా ఎక్కువ.

49

ఈ ప్రాతిపాదనను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఈ ఫిట్ మెంట్ ప్రతిపాదనను అంగీకరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

59

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే జీతం ఎంత పెరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57గా నిర్ణయిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 157% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

69

ఇదిలా ఉంటే ప్రస్తుతం బేసిక్ శాలరీ నెలకు రూ. 18,000గా ఉంది. అయితే  ప్రతిపాదిత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో, ఇది నెలకు రూ. 46,260కి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

79

అదేవిధంగా, కనీస పెన్షన్ నెలకు రూ. 23,130కి పెరిగే అవకాశం ఉంది.అన్ని అనుకున్నట్లు జరిగితే 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 

89

ఇది 7వ వేతన సంఘం కింద 2016లో అమలు చేసిన ప్రస్తుత జీతం విధానానికి ముగింపు పలుకుతుంది. ప్రభుత్వం ఇప్పుడు 1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది, దీని ద్వారా కనీస జీతం నెలకు రూ. 34,560 వరకు పెరిగే అవకాశం ఉంది.

99

అయితే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 అయితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు 157 శాతం పెరుగుతాయి. మరి జీతాలు ఎంత పెరగనున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. 

Read more Photos on
click me!

Recommended Stories