ఎండాకాలంలో రోడ్లపై వెళ్లే వాహనాల టైర్లు పేలిపోయిన సంఘటనల గురించి తరచూ వార్తల్లో చూస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఈ ప్రమాదాలు చాలా దారుణంగా ఉంటాయి. ప్రాణాలు కూడా పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ టైర్ ఎందుకు పేలుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 ముఖ్యమైన కారణాలు గురించి తెలుసుకోండి. జాగ్రత్తలు పాటించండి.
1. అవసరానికి మించి గాలి నింపొద్దు
టైర్లలో ఎక్కువ లేదా చాలా తక్కువ గాలి ఉంటే ప్రెషర్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఎండాకాలంలో రోడ్డు ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇది టైర్ టెంపరేచర్‌ను పెంచుతుంది. లోపల గాలి వ్యాకోచిస్తుంది. అందువల్లనే టైరు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
2. పాత, అరిగిపోయిన టైర్లు మార్చేయండి
మీ కారు టైర్లు పాతవైపోతే వాటిలో పగుళ్లు ఉండే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో ఇలాంటి పేలడానికి చాలా అవకాశాలు ఉంటాయి. పాత టైర్ ఎక్కువ ప్రెషర్‌ను తట్టుకోలేదు. ఎక్కువ వేగంతో వెళ్లే ఒక్కసారిగా పేలిపోతుంది.
3. వేగంగా వెళ్తున్నప్పుడు సడెన్ బ్రేక్ వద్దు
హైవేపై ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడు సడెన్‌గా బ్రేక్ వేస్తే, టైర్‌పై ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ప్రెషర్ వల్ల టైర్ పేలడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
4. టైర్ లో ప్రెషర్ కరెక్ట్ గా ఉండాలి
ప్రతి కార్ టైర్‌కు ఒక సరైన ప్రెషర్ ఉంటుంది. దానిని తయారీ కంపెనీ సూచిస్తుంది. టైర్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అది టైర్ పట్టును బలహీనపరుస్తుంది. దీంతో టైరు పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
5. ఎక్కువ బరువుతో ప్రయాణించొద్దు
మీరు చెడ్డ రోడ్లపై ఎక్కువ వేగంతో వెళ్లినా లేదా కారులో ఎక్కువ బరువు వేసినా, టైర్ త్వరగా వేడెక్కి ఒక్కసారిగా పేలిపోతుంది.
ఎండాకాలంలో కార్ టైర్ పేలకుండా ఏం చేయాలి
ప్రతి 15 రోజులకు ఒకసారి టైర్ ప్రెషర్‌ను చెక్ చేయండి.
అవసరానికి మించి గాలి నింపకండి. సరైన PSIని మెయింటైన్ చేయండి.
పాతవి, అరిగిపోయిన టైర్లను వెంటనే మార్చండి.
ఎక్కువ వేగంతో వెళ్లేటప్పుడు సడెన్‌గా బ్రేక్ వేయకండి.
కారులో అవసరానికి మించి బరువు పెట్టకండి.
ఇది కూడా చదవండి వామ్మో.. అన్ని కార్ల కంపెనీలు ధరలు పెంచేశాయి. ఇక కారు కొనడం కష్టమేనా?