ఒక ఎకరానికి గాను విత్తనాలకు సుమారు రూ. 2000 నుంచి రూ. 4000 వరకు ఖర్చవుతుంది. ఇక ఎరువుల విషయానికొస్తే రూ. 8,000 నుంచి రూ. 12,000 వరకు అవుతుంది. కూలీ ఖర్చు రూ. 10,000 నుంచి రూ. ₹15,000 వరకు అవుతుంది. ఇతర ఖర్చులన్నీ కలిపితే మొత్తం రూ. 5 వేలు అవుతాయి. ఇలా చూసుకుంటే ఎకరంలో సాగు చేయడానికి మొత్తం పెట్టుబడి సుమారు రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు అవుతుంది.
లాభాల విషయానికొస్తే.. ఒక ఎకరానికి 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం కిలో క్యారెట్ ధర రూ. 15 నుంచి రూ. 30 ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఎకరం పొలంలో సాగుతో రూ. 3 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. మార్కెటింగ్ ఆధారంగా 3 నెలలకు సుమారు రూ. 2 లక్షల వరకు లాభం పొందొచ్చు.