5 రూపాయలకే వన్ డే అన్ లిమిటెడ్ కాల్స్, 1GB డేటా... ఈ బిఎస్ఎన్ఎల్ రీచార్జ్ ప్లాన్ అదిరిపోలా..!

Published : Aug 25, 2025, 02:21 PM IST

ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్ టెల్ లకు ప్రభుత్వరంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ గట్టిపోటీ ఇస్తోంది. ఆ సంస్థలు రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచినా బిఎస్ఎన్ఎల్ అతితక్కువ ధరల ప్లాన్స్ కొనసాగిస్తోంది. అలాంటి ఓ పాపులర్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
జియో, ఎయిర్ టెల్ లకు బిఎస్ఎన్ఎల్ పోటీ

BSNL Recharge Plans : ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) చవకైన రీచార్జ్ ప్లాన్స్ ను వినియోగదారులకు అందిస్తోంది. ప్రైవేట్ టెలికాం దిగ్గజ సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ వంటివి కూడా ఇటీవల రీచార్జ్ ప్లాన్ ధరలు పెంచుతున్నాయి... ఈ సమయంలోనూ బిఎస్ఎన్ఎల్ రూ.100 నుండి రూ.200 లోపు రీచార్జ్ ప్లాన్స్ ను కొనసాగిస్తోంది. ఇలాంటి తక్కువ ధర రీచార్జ్ ప్లాన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలా ప్రైవేట్ సంస్థలతో పోటీపడుతూ టెలికాం మార్కెట్లో ఇంకా గట్టిగా నిలబడేందుకు ఈ ప్రభుత్వ టెలికాం సంస్థ ప్రయత్నిస్తోంది.

ఇటీవల జియో, ఎయిర్ టెల్ సంస్థలు తక్కువ ధరతో అందించే రీచార్జ్ ప్లాన్స్ తొలగించిన విషయం తెలిసిందే... రూ.200 కు పైగానే ప్లాన్ ధర ఉన్నా, అత్యధికమంది వినియోగదారులు ఉపయోగిస్తున్నా రీచార్జ్ ప్లాన్స్ ను తొలగించాయి. కాని బిఎస్ఎన్ఎల్ కేవలం రూ.147 కే నెలరోజుల వ్యాలిడిటీలో రీచార్జ్ ప్లాన్ అందిస్తోంది... ఇందులో కేవలం అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ మాత్రమే కాదు డేటా కూడా లభిస్తుంది. ఇలా బిఎస్ఎన్ఎల్ అందించే బడ్జెట్ ప్రెండ్లీ రీచార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

DID YOU KNOW ?
జియో ప్లాన్స్ తొలగింపు
రిలయన్స్ జియో ఇటీవల రూ.799 రీచార్జ్ ప్లాన్ కూడా తొలగించింది. 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జిబి అందించే ప్లాన్ ఇది.
25
బిఎస్ఎన్ఎల్ రూ.147 రీచార్జ్ ప్లాన్ వివరాలు

భారత్ సంచార్ నిగమ్ లిమిలెడ్ (BSNL)ఇటీవలకాలంలో జియో, ఎయిర్ టెల్ లకు గట్టిపోటీ ఇస్తోంది. అతి తక్కువలో డబ్బులను ఛార్జ్ చేస్తూ అత్యుత్తమ సేవలను తమ వినియోగదారులకు అందిస్తుండటంతో ఇతర టెలికాం సంస్థల కస్టమర్లు కూడా దీనివైపు ఆకర్షితులవుతున్నారు. ఇలా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అందిస్తున్న చవక రీచార్జ్ ప్లాన్స్ లో రూ.147 ప్లాన్ ఖచ్చితంగా ఉంటుంది.

ఎక్కువగా ఫోన్స్ కాల్స్ మాట్లాడుతూ ఇంటర్నెట్ పరిమితంగా ఉపయోగించేవారికి బిఎస్ఎన్ఎల్ రూ.147 రీచార్జ్ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ లో నెల అంటే 30 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి. అతేకాదు నెలరోజుల్లో ఎప్పుడైనా ఉపయోగించేలా 10GB హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది... తర్వాత కూడా తక్కువ స్పీడ్ (40kbps) తో ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు ఉంటుంది. ఇలా అపరిమిత వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ డేటాతో కూడిన బడ్లెట్ రీచార్జ్ ప్లాన్ కోసం చూసేవారు ఈ రూ.147 ప్లాన్ ను ట్రై చేయవచ్చు.

35
కేవలం రూ.5 కే వాయిస్ కాల్స్, డేటా

ఆసక్తికర విషయం ఏమిటంటే 30 రోజులకు రూ.147 అంటే రోజుకు దాదాపు ఐదు రూపాయలలోపే బిఎస్ఎన్ఎల్ ఛార్జ్ చేస్తున్నట్లు. ఇతర టెలికాం సంస్థలు వన్ డే వ్యాలిడిటీతో కేవలం 1GB డాటాను రూ.20 కి అందిస్తున్నాయి... కానీ బిఎస్ఎన్ఎల్ ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా రూ.5 కే అపరిమిత కాల్స్, ఢేటా అందిస్తుంది. జియో, ఎయిర్ టెల్ లకు షాక్ ఇస్తూ బిఎస్ఎన్ఎల్ ఈ చౌక రీచార్జ్ ప్లాన్ ను కొనసాగిస్తోంది.

45
249 ప్లాన్ ను తొలగించిన జియో

భారతీయ టెలికాం రంగ ముఖచిత్రాన్నే మార్చేసిన సంస్థ రిలయన్స్ జియో. దీని మార్కెట్ ఎంట్రీనే అద్భుతం... ఉచితంగానే ఇంటర్నెట్ డేటా అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇలా సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీతో కస్టమర్లను పెంచుకున్న జియో ఇప్పుడు వారిపై రీచార్జ్ భారం మోపుతోంది. జియోలో బడ్జెట్ ప్రెండ్లీ రీచార్జ్ ప్లాన్ అంటే రూ.249 ప్లాన్ గుర్తుకువస్తుంది... చాలామంది దీన్ని వాడేవారు. కానీ ఇటీవల జియో ఈ పాపులర్ రీచార్జ్ ప్లాన్ ని ఎత్తేసింది.

కేవలం రూ.249 తో రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో అపరిమిత వాయిస్ కాల్స్ వచ్చేవి. అంతేకాదు ఎస్ఎంఎస్ లు కూడా లభించేవి. ఇక డేటా విషయానికి వస్తే రోజుకు 1 జిబి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందేవి... అంటే 28 రోజులకు 28 జిబి డేటా వచ్చేది. ఇలాంటి ప్లాన్ ను సడన్ గా తొలగించడంతో జియో వినియోగదారులు షాక్ కు గురవడమే కాదు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు.

55
జియో బాటలోనే ఎయిర్టెట్.. రూ.248 ప్లాన్ తొలగింపు

భారత ప్రజలకు ఉత్తమ టెలికాం సేవలు అందించడంలోనే కాదు రీచార్జ్ ప్లాన్ తొలగించడంలోనూ జియో, ఎయిర్ టెల్ లు పోటీపడుతున్నాయి. ఎయిర్ టెల్ కూడా ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్ రూ.249 ను తొలగించింది. ఈ ప్లాన్ రీచార్జ్ తో ఎయిర్ టెల్ యూజర్స్ కి 24 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా వచ్చేవి. ఇక రోజుకు 1జిబి హైస్పీడ్ డేటా 24 రోజులపాటు లభించేది.. అంటే 24 జిబి వచ్చేదన్నమాట.

రూ.249 రీచార్జ్ ప్లాన్ ని రూ.299 కి పెంచింది ఎయిర్ టెల్... అయితే వ్యాలిడిటీని కూడా మరో నాల్రోజులు పెంచి 28 రోజులకు మార్చింది. అలాగే రోజువారి డేటాను 1GB నుండి 1.5 GB కి మార్చింది. అంటే ప్లాన్ ధరతో పాటు ప్రయోజనాలను కూడా పెంచింది ఎయిర్ టెల్.

Read more Photos on
click me!

Recommended Stories