వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్.. క్లిక్‌ చేశారో ఖాతా ఖాళీ

Published : Aug 24, 2025, 08:14 PM IST

WhatsApp wedding card scam : వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్‌లో మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రూ.1.9 లక్షలు కోల్పోయారు. సైబర్ క్రైమ్ పోలీసు ఇలాంటి మోసాలపై హెచ్చరికలు జారీ చేశారు. అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్ ఎలా చేశారు?

ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో జాగ్రత్తగా ఉండకపోతే ఒక్క క్లిక్‌తో పెద్ద మొత్తంలో మీరు నష్టపోవచ్చు. అలాంటి మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాకు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల వాట్సాప్ వెడ్డింగ్ కార్డ్ స్కామ్‌కు బలయ్యాడు. ఈ స్కామ్ తో ఆయన కేవలం ఒక క్లిక్‌తోనే రూ.1.9 లక్షలు కోల్పోయాడు. 

ఈ స్కామ్ వివరాలు గమనిస్తే.. వాట్సాప్ లో ఒక తెలియని ఫోన్ నంబర్ నుండి అతనికి పెళ్లి ఆహ్వానం వచ్చింది. ఆ సందేశంలో పెళ్లి తేదీ, ఆహ్వానం పలుకుతూ గ్రీటింగ్స్ పంపారు. దాంతో పాటు ఒక పీడీఎఫ్ ఫైల్‌లా కనిపించే డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ పంపించారు. అయితే, అది పీడీఎఫ్ కాదు.. ఒక మాలిషియస్ APK ఫైల్.

DID YOU KNOW ?
భారత్ లో పెరుగుతున్న సైబర్ నేరాలు
NCRB, ఇతర రిపోర్టుల ప్రకారం.. 2024లో సైబర్ నేరగాళ్ల చేతిలో భారతీయ పౌరులు దాదాపు రూ. 22,845 కోట్లు కోల్పోయారు. ఇది 2023లో జరిగిన నష్టం (దాదాపు రూ. 7,465 కోట్లు) తో పోలిస్తే 206% పెరుగుదల.
25
APK ఫైల్ క్లిక్ చేసిన వెంటనే ఖాతా ఖాళీ

ఉద్యోగి ఆ ఫైల్‌పై క్లిక్ చేయగానే అది అతని మొబైల్‌లో ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాలేషన్ పూర్తికాగానే ఆ APK ఫైల్ ద్వారా స్కామర్లు అతని ఫోన్‌పై పూర్తి నియంత్రణ పొందారు. కొన్ని నిమిషాల్లోనే మోసగాళ్లు అతని బ్యాంకింగ్ యాప్‌లను యాక్సెస్ చేసి, మొత్తం రూ.1.9 లక్షలు ఖాతా నుంచి కాజేశారు.

35
సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలు

ఈ ఘటనపై ఉద్యోగి ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ తరహా మోసాలు దేశంలో పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి స్కామ్‌లపై హెచ్చరికలు జారీ చేశాయి. తెలియని నంబర్ల నుండి వచ్చే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయొద్దని తెలిపాయి. 

45
డబ్బులే కాదు వ్యక్తిగత డేటా చోరీతో బెదిరింపులు

ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు ముందుగా మీ ఫోన్, ట్యాబ్ లేదా ల్యాప్ టాప్ లను తమ ఆధీనంలోకి తీసుకునే సాధారణ ఫైల్స్ గా కనపడే స్పైవేర్ లను పంపుతారు. ఉదాహారణకు మీ వాట్సాప్ కు గుర్తు తెలియని నంబర్ల నుంచి APK ఫైల్స్ లేదా లింకులు వస్తాయి. పొరపాటున మనం వాటిని క్లిక్ చేస్తే.. మనకు తెలియకుండానే మన డివైస్ హ్యాక్ అవుతుంది. 

మన డేటాతో పాటు బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన వివరాలు తీసుకుని కొన్ని నిమిషాల్లోనే ఖాతా ఖాళీ చేస్తారు. మీ స్నేహితులు, బంధువులకు కూడా ఇలాంటి మోసపూరిత సందేశాలు మీ డివైస్ నుంచి పంపవచ్చు. కాబట్టి గుర్తుతెలియని నెంబర్ల నుంచి వచ్చే లింక్స్ ను క్లిక్ చేయకండి, ఫైల్స్ ను ఓపెన్ చేయకండి.

55
ఇలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా కొన్ని సూచనలు

1. తెలియని నంబర్ల నుండి వచ్చిన లింక్స్ ను క్లిక్ చేయకండి, ఫైళ్లను ఓపెన్ చేయకండి.

2. ఏదైనా సందేశం వచ్చినప్పుడు ముందుగా ఆ నంబర్‌ తెలిసిన వాళ్లదేనా? కాదా? అనే విషయాలు ధృవీకరించండి. ట్రూకాలర్ వంటి యాప్‌లతో వివరాలు చెక్ చేయండి.

3. APK ఫైళ్లను అసలు ఇన్‌స్టాల్ చేయవద్దు. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఎక్కడి నుండి వచ్చినా వాటిని మీ డివైస్ లలో ఇన్ స్టాల్ చేయవద్దు.

4. పొరపాటున అనుమానాస్పద ఫైళ్లను క్లిక్ చేసినట్టు మీరు గుర్తించగలిగితే వెంటనే మీ బ్యాంక్ యాప్ పాస్‌వర్డ్లు మార్చండి.

5. తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. స్థానిక పోలీసు స్టేషన్లను కూడా సంప్రదించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories