జియో VS ఎయిర్ టెల్ VS బిఎస్ఎన్ఎల్ : మూడిట్లోనూ రూ.299 రీచార్జ్ ప్లాన్, మరి ఏది బెస్ట్

Published : Aug 27, 2025, 10:13 PM IST

జియో, ఎయిర్‌టెల్‌లను మించిపోయేలా బిఎస్ఎన్ఎల్ రూ.299 రీచార్జ్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు చూద్దాం. 

PREV
14
జియో, ఎయిర్ టెల్ తో బిఎస్ఎన్ఎల్ ఫోటీ

ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ తో పాటు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కూడా తమ కస్టమర్లకు రూ.299 ప్లాన్స్ అందిస్తున్నాయి. మరి ఈ మూడింటిలో ఏది ఉత్తమం? ఏ ప్లాన్‌లో ఎక్కువ డేటా, ఇతర ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.

24
జియో రూ.299 రీచార్జ్ ప్లాన్

ముందుగా రిలయన్స్ జియో రూ.299 ప్లాన్ ను పరిశీలిస్తే… ఇది ఎక్కువ డేటా, అపరిమిత కాల్స్ కావాలనుకునేవారికి అనువైనది. ఈ ప్యాక్‌లో 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా లభిస్తుంది. అంటే మొత్తం 42GB డేటా. దీంతోపాటు రోజుకు 100 SMSలు ఉచితం. జియోటివి, జియోక్లౌడ్ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

34
ఎయిర్ టెల్ రూ.299 రీచార్జ్ ప్లాన్

ఇక ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. కానీ ఇందులో రోజుకు కేవలం 1GB డేటా అంటే మొత్తం 28GB డేటా లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితం. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్, వింక్ మ్యూజిక్, అపోలో 24/7 సర్కిల్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

44
బిఎస్ఎన్ఎల్ రూ.299 రీచార్జ్ ప్లాన్

BSNL రూ.299 ప్లాన్ ఇతర కంపెనీల కంటే మెరుగైనది. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3GB డేటా అందిస్తుంది… అంటే మొత్తం 90GB డేటా లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు ఉచితం. BSNL ట్యూన్స్, సెల్ఫ్‌కేర్ యాప్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories