టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరి ముఖ్యం ఆపిల్ లవర్స్ కు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఆపిల్ తన కొత్త iPhone 17 సిరీస్‌ని అతి త్వరలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో (Apple iPhone 17 Series) iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Pro Max, iPhone 17 Air వంటి హై ఫీచర్ ను ఫోన్లను కూడా ఆవిష్కరించబోతుంది. ఇంతకీ ఈ కొత్త ఐఫోన్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడు? ధరలు, ఫీచర్స్, ఇంకా మరెన్నో డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
25
ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ ఎప్పుడంటే ?
ఆపిల్ టీవీ యాప్‌లో ఈవెంట్ ఇన్విటేషన్ (Awe-Dropping) బ్యానర్ పోస్ట్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి.. సెప్టెంబర్ 9న ‘అవే డ్రాపింగ్’ అనే ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఆపిల్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఈవెంట్ లో iPhone 17 సిరీస్ (ఐఫోన్ 17, 17 ఎయిర్, 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్) తో పాటు Apple Watch Series 11, Apple Watch Ultra 3, Apple Watch SE 3, AirPods Pro 3, HomePod mini & Apple TV 4K కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి ప్రీ-ఆర్డర్స్ కూడా స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
35
ఐఫోన్ 17 సిరీస్ డిజైన్ లో మార్పులు
iPhone 17 Pro, iPhone 17 Pro Max మోడల్స్‌లో కీలక మార్పులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో A19, A19 Pro చిప్‌లు ఫోన్ల పనితీరును మరింత వేగవంతం చేస్తాయి. అలాగే.. టైటానియం బదులుగా బలమైన అల్యూమినియం ఫ్రేమ్ వాడబోతున్నట్టు తెలుస్తోంది.
కెమెరా మాడ్యూల్ డిజైన్ చతురస్రాకారం బదులుగా పిల్/బార్ షేప్ లోకి మారినట్టు తెలుస్తోంది. అన్ని Pro మోడల్స్‌లో ProMotion 120Hz డిస్‌ప్లే యూజ్ చేసినట్టు లీక్‌లు చెబుతున్నాయి, ఈ డిస్ ప్లే స్క్రీన్ స్మూత్‌నెస్‌ను పెంచుతుంది.
ఐఫోన్ 17 కూడా ఐఫోన్ 16 మాదిరిగానే డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో డ్యూయల్ కెమెరా- 48MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంటాయి. ఇందులో బిగ్ స్క్రీన్, 120Hz ప్రో- మోషన్ టెక్ ఉండవచ్చు. ఆపిల్ A19 ప్రాసెసర్ తో వస్తోంది. 8GB ర్యామ్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, కెమెరా కంట్రోల్స్, సపోర్టు అందించవచ్చు.
ఇక iPhone Air డిస్‌ప్లే 6.6 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. దీనిలో ఆపిల్ సొంతంగా తయారు చేసిన C1 మోడెమ్ వాడినట్టు తెలుస్తోంది. వెనుక భాగంలో ఒకే కెమెరా ఉండే అవకాశం ఉంది. iPhone 17 Air Plus మోడల్ స్థానంలో విడుదల అవ్వనుంది, తద్వారా వినియోగదారులు స్లిమ్ అండ్ మోడ్రన్ లూక్ ను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు.
55
ఐఫోన్ 17 సిరీస్ ధరలు ఎలా ఉండనున్నాయి?
iPhone 17 సిరీస్ ధర విషయానికొస్తే.. భారత మార్కెట్లో ఐఫోన్ 17 ప్రారంభ ధర సుమారు ₹83,300 ఉండవచ్చని అంచనా. ఇక iPhone 17 Air ధర ₹90,000 – ₹1,00,000 మధ్య ఉండవచ్చు. iPhone 17 Pro మోడల్స్ ధరలు మరింత ఎక్కువగా ఉండవచ్చు.
iPhone 17 Pro Max సుమారు ₹1,65,000 వరకు ఉండవచ్చని లిక్స్ చెబుతున్నాయి. ఆపిల్ ఈవెంట్ చూడాలంటే.. ఆపిల్ తన YouTube అధికారిక ఛానల్‌లో ఈవెంట్ లైవ్ షెడ్యూల్ చేసింది. రిమైండర్ ఆన్ చేస్తే, ఈవెంట్ ప్రారంభమవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది.