టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఢిల్లీ హైకోర్టులో స్పైస్ జెట్ పై కేసు వేసింది. తమకు రావాల్సిన బకాయిలను స్పైస్ జెట్ చెల్లించడం లేదని, ఆ డబ్బులను ఎగ్గొట్టిందని ఆరోపిస్తోంది. ఎలా అప్పు పడిందో తెలుసుకోండి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అతిపెద్ద టెక్ కంపెనీ ఇది. స్పైస్ జెట్ పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తమకు రావాల్సిన బకాయిలను తిరిగి ఇవ్వడం లేదంటూ కోర్టులో ఆరోపించింది. 2019 నుంచి 2023 మధ్య స్పైస్ జెట్ కోసం తమ సాఫ్ట్ వేర్ సేవలను అందించామని.. అయితే ఆ సేవలకు గాను ఇంతవరకు ఎలాంటి డబ్బును చెల్లించలేదని టీసీఎస్ ఆరోపించింది. టిసిఎస్.. స్పైస్ జెట్ ఎయిర్ లైన్ కోసం SAP, S/4 HIN సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసి ఇచ్చింది. కానీ దానికి సంబంధించిన బిల్లులను మాత్రం స్పైస్ జెట్ చెల్లించలేదని ఆరోపించింది.
24
ఎంత అప్పు పడింది?
బిల్లులు చెల్లించాలని స్పైస్ జెట్ ను.. టిసిఎస్ పదే పదే కోరినప్పటికీ అది నిరాకరిస్తూ వచ్చిందని టిసిఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దాదాపు 2.34 లక్షల కోట్ల రూపాయలు స్పైస్ జెట్, టిసిఎస్ కి ఇవ్వాల్సి ఉందని.. అవి ఇచ్చేలా ఆదేశాలు ఇమ్మని కోర్టును కోరుతోంది టిసిఎస్. కోర్టు మధ్యవర్తిత్వం చేస్తూ ఇచ్చిన అవకాశాలను కూడా స్పైస్ జెట్ పాటించలేదు. దీంతో కోర్టు స్పైస్ జెట్ కు నాలుగు వారాల్లో స్పందించాలని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 14న జరుగుతుందని చెప్పింది.
34
మొండికేసిన స్పైస్ జెట్
బకాయి పడిన మొత్తాన్ని తిరిగి పొందడానికి టిసిఎస్ అనేక రకాలుగా ప్రయత్నించింది. కానీ స్పైస్ జెట్ ఏమాత్రం స్పందించలేదని టిసిఎస్ చెబుతోంది. ఈ కేసు రెండు సంస్థల మధ్య దీర్ఘకాలిక వ్యాపార సంబంధాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. భవిష్యత్తులో స్పైస్ జెట్ కోసం టిసిఎస్ సేవలను వాడుకోవడం కాస్త కష్టతరంగా మారవచ్చు.
నిజానికి గత ఏడాది జనవరిలోనే స్పైస్ జెట్, టిసిఎస్ కి ఇవ్వాల్సిన బకాయిల మొత్తాన్ని ఇచ్చేందుకు ఒప్పుకుంది. పూర్తి బిల్లింగ్ సమాచారాన్ని టిసిఎస్, స్పైస్ జెట్ కు పంపించింది. అయినప్పటికీ కూడా ఆ ఎయిర్ లైన్స్ ఒక్క రూపాయి కూడా టిసిఎస్ కి చెల్లించలేదు. టిసిఎస్ అనేకసార్లు ఫాలోఅప్ చేసినా కూడా ఫలితం లేకపోవడంతో గత ఏడాది జూన్ 15న స్పైస్ జెట్ కు లీగల్ నోటీసులు పంపింది. అయినా కూడా ఆ కంపెనీ స్పందించలేదు. దీంతో కోర్టు వరకు రావాల్సి వచ్చిందని టిసిఎస్ వివరిస్తోంది.