కాశీలో మరణించిన గర్భిణీ స్త్రీలను అక్కడ దహనం చేయరు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. గర్భిణీ స్త్రీల శరీరాన్ని కాల్చితే కడుపు ఉబ్బిపోయి చితిలో పేలిపోయే అవకాశం ఉంటుంది. అది వాతావరణానికి, చుట్టుపక్కల పరిశరాలకు మంచిది కాదు. కాబట్టి గర్భిణీ స్త్రీల శవాలను కాశీలో కాల్చరు.
కాశీలో సాధువుల శవాలను కాల్చరు. వారి శరీరాన్ని నీటిలో వదులుతారు లేదా పాతిపెడతారు. ఎందుకంటే సాధువుల శవాలు కూడా ఇతర జీవులకు ఆహారంగా ఉపయోగపడాలని వారు ఇలా చేస్తారు.
కాశీలో చిన్న పిల్లల శవాలను కూడా కాల్చరు. ఒక పిల్లవాడు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉంటే, ఆ శవాన్ని దహనం చేయరు. పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను దేవుడి స్వరూపంగా భావిస్తారు. ఈ కారణంగా ఆ శవాలను కాల్చడం కాశీలో నిషేధం.
పాము కాటుతో చనిపోయిన వారి శవాలను కూడా కాశీలో దహనం చేయరు. పాము కాటుతో చనిపోయిన వారి మెదడు 21 రోజుల వరకు సజీవంగా ఉంటుందని చెబుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి మృతదేహాన్ని అరటి దుంగలో కట్టి నీటిలో తేలియాడేలా చేస్తారు. ఈ శరీరం తాంత్రికుల కంట పడితే, వారు ఈ శరీరాలను మళ్లీ బతికిస్తారని కాశీలో నమ్ముతారు.
కాశీలో చర్మ వ్యాధి లేదా కుష్టు వ్యాధితో బాధపడుతున్న రోగి చనిపోతే వారి శరీరాన్ని దహనం చేయరు. వారి శవాలను దహనం చేస్తే వ్యాధి బ్యాక్టీరియా గాలిలో వ్యాప్తి చెంది ఇతరులు కూడా ఈ వ్యాధికి గురవుతారు. ఈ కారణంగా కాశీలో వారి మృతదేహాలను కాల్చడం నిషేధం.