టాటా కర్వ్ లో ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
టాటా కర్వ్ కారులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆరు విధాలుగా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు ఉన్నాయి. అంతేకాకుండా ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నాలుగు స్పోక్ డిజిటల్ స్టీరింగ్ వీల్, 12.3 అంగుళాల హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.
ఈ క్లస్టర్‌లో ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, టచ్ ఆధారిత HVAC కంట్రోల్స్, AQI డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్, తొమ్మిది స్పీకర్ JBL ఆడియో సిస్టమ్ వంటి అనేక ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. కర్వ్ కారులో జస్ట్ సైగలతో నియంత్రించే పవర్డ్ టెయిల్‌గేట్ కూడా ఉంది.