ఫోన్ నీళ్ళలో పడిందా? వెంటనే ఈ పని చేయండి మొబైల్ పాడవ్వదు

Published : Aug 28, 2025, 09:29 AM IST

మొబైల్ ఫోన్ నీళ్లలో పడడం అనేది ఎంతో మందికి జరిగే ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు. ఫోన్ నీళ్లలో పడిన వెంటనే కొన్ని చిట్కాలు పాటిస్తే దాన్ని పాడవ్వకుండా కాపాడుకోవచ్చు.

PREV
16
ఫోన్ నీళ్లలో పడితే...

వర్షంలో  ఫోన్ తడిసిపోవడం లేదా నీళ్లలో అనుకోకుండా ఫోన్ పడడం వంటివి జరుగుతూ ఉంటాయి.  అది పూర్తిగా పాడైపోతుందనే భయం కలగడం సహజం. నిజానికి భయపడాల్సిన అవసరం లేదు.  సరైన సమయంలో కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే మీ ఫోన్‌ పాడవ్వకుండా కాపాడుకోవచ్చు. ఏం చేయాలో తెలుసుకోండి.

26
వెంటనే ఫోన్ ఆఫ్ చేయండి

మీ ఫోన్ నీళ్ళలో పడిన వెంటనే చేయవలసిన మొదటి పని.. దానిని వెంటనే స్విచ్ఛాప్ చేయాలి. ఫోన్ తడిగా ఉన్నప్పుడు, ఆన్ చేసినా లేదా ఏదైనా బటన్ నొక్కినా అది ఫోన్ లోపల షార్ట్ సర్క్యూట్‌కు కారణమవుతుంది.  దాని వల్ల ఫోన్‌ పూర్తిగా పాడయ్యే అవకాశం ఉంది.  ఫోన్ ఆఫ్ చేయడం వల్ల మొబైల్ ను కాపాడుకోవచ్చు.

36
యాక్సెసరీస్ తీసివేయండి

నీటిలో ఫోన్ పడిపోయాక ఫోన్ ఆఫ్ చేసేయాలి. ఆ ఫోన్ ఆఫ్ చేశాక మృదువైన వస్త్రం లేదా టిష్యూ పేపర్‌తో ఫోన్ బయటి భాగంలోని నీటిని పూర్తిగా తుడవండి. తరువాత, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్, బ్యాక్ కవర్, స్క్రీన్ గార్డ్ వంటి అన్ని యాక్సెసరీస్‌ను తీసివేయండి. ఇలా చేయడం వల్ల ఫోన్ లోపల ఉన్న తడి మొత్తం త్వరగా ఆరిపోవడానికి ఉపయోగపడుతుంది.

46
హెయిర్ డ్రైయర్ వంటి పరికరాలతో వద్దు

ఫోన్ లోని తడి ఆరబెడితే దాన్ని పాడవ్వకుండా కాపాడుకోవచ్చు. ఫోన్ ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ వాడటం చాలా ప్రమాదకరం. ఇలా హెయిర్ డ్రయ్యర్లతో ప్రత్యక్ష వేడి ఫోన్ కు గురిచేయడం వల్ల లోపల ఉన్న సున్నితమైన సర్క్యూట్‌లు, బ్యాటరీ సెల్స్‌ దెబ్బతినే అవకాశం ఉంది. దానికి బదులుగా, ఫోన్‌ను సహజంగా గాలి తగితే ప్రదేశంలో ఉంచడం లేదా ఫ్యాన్ కింద ఉంచి ఆరబెట్టడం చేయాలి. ఫోన్‌ను ఎక్కువసేపు ఎండలో ఉంచడం వంటివి చేయకూడదు.

56
బియ్యంలో పెట్టండి

ఇది పాత పద్ధతే అయినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తడిచి పోయిన ఫోన్‌ను బియ్యం బస్తాలో ఉంచడం వల్ల  బాగా పనిచేస్తుంది. బియ్యానికి తేమను పీల్చుకునే శక్తి ఎక్కువ. మీ ఫోన్‌ను బియ్యం నిండిన ఒక డబ్బాలో పెట్టి పైన మూతపెట్టేయాలి. అలా 24 నుండి 36 గంటల వరకు ఉంచాలి. బియ్యం కంటే మెరుగైనవి సిలికా జెల్ ప్యాకెట్లు (సాధారణంగా కొత్త వస్తువులలో కనిపించే చిన్న ప్యాకెట్లు) కూడా బాగా పనిచేస్తాయి. ఇవి తేమను చాలా వేగంగా పీల్చుకుంటాయి.

66
ఫోన్ ఎప్పుడు ఆన్ చేయాలి?

పైన చెప్పిన అన్ని చిట్కాలను పాటించాక.. ఫోన్ పొడిగా మారిందని అనిపించినా కూడా దానిని వెంటనే ఆన్ చేయవద్దు. కనీసం 24 గంటలైనా వేచి ఉండటం మంచిది. ఒక రోజు తర్వాత ఆన్ చేశాక ఫోన్ పనిచేయకపోతే కొన్ని గంటల తర్వాత ఛార్జ్ పెట్టి చూడండి. ఈ పద్ధతుల తర్వాత కూడా ఫోన్ పనిచేయకపోతే అప్పుడు  సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లండి.

Read more Photos on
click me!

Recommended Stories