Business Idea : ఉద్యోగం వదిలి వ్యాపారం చేయాలా..? తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే బిజినెస్‌లు ఇవే

Published : Mar 23, 2026, 11:28 AM IST

సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్త అవ్వాలంటే డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు… మార్కెట్ డిమాండ్‌ను అర్థం చేసుకుని, సరైన రంగాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొన్ని వ్యాపారాల్లో ఎప్పటికీ నష్టాలుండవు, పైగా మంచి లాభాలను అందిస్తాయి. అలాంటి రంగాలేవో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
సూపర్ బిజినెస్ ఐడియాస్..

ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ పని ఒత్తిడితో విసిగిపోయినవారు… అసలు ఒకరికింద ఉద్యోగం చేయడమే ఇష్టంలేనివారు వ్యాపారం చేయాలని కలలు కంటుంటారు. చిన్నదో పెద్దదో ముందుగా బిజినెస్ ప్రారంభించాలని... సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ ఏ వ్యాపారం మొదలుపెట్టాలి, దేనికి మార్కెట్లో డిమాండ్ ఉంది అనేది తెలియక తికమకపడతారు. వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే పెట్టుబడి, తెలివితేటలతో పాటు మనం ఎంచుకునే రంగం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ రోజుల్లో మంచి లాభాలు ఇచ్చే వ్యాపారాలు ఏవో ఇక్కడ చూద్దాం.

మన బిజినెస్‌లో సక్సెస్ అవ్వాలంటే, ముందుగా మనం ఎంచుకున్న రంగంపై పట్టు సాధించాలి. గత కొన్నేళ్లుగా మన దేశంలో ఫుడ్, ఎడ్యుకేషన్, నిత్యావసరాలు, హెల్త్‌కేర్ రంగాలు దూసుకుపోతున్నాయి... ఈ వ్యాపారాలు చేసినవారు పెద్దగా దెబ్బతిన్న సందర్భాలు లేవు. ఇవి మనిషి మనుగడకు చాలా అవసరం. కాబట్టి వీటిపై పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు వస్తాయి.

25
ఆహారం, కిరాణా (Food & Groceries)

ప్రతి ఒక్కరికీ ఆహారం ప్రాథమిక అవసరం. అందుకే ఈ వ్యాపారం ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. టిఫిన్ సెంటర్,  ఫుడ్ హోమ్ డెలివరీ లేదా చిన్న హోటల్ వంటివి ఇతర వ్యాపారాల కన్నా 5 రెట్లు ఎక్కువ లాభంతో మంచి ఆదాయాన్ని అందిస్తాయి. వీటితో పాటు కిరాణా షాపులు కూడా మన రోజువారీ జీవితంలో చాలా ముఖ్యం. అందుకే పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు వచ్చినా, చాలామందికి దగ్గర్లోని కిరాణా కొట్టే మొదటి ఆప్షన్. కాబట్టి ఇవి కూడా మంచి లాభాలను తెచ్చిపెడతాయి.

35
విద్య, ఆరోగ్యం (Health, Education)

భారత్‌లో వేగంగా ఎదుగుతున్న రంగాల్లో విద్య, ఆరోగ్యం ముందున్నాయి. ట్యూషన్ క్లాసులు, కోచింగ్ సెంటర్ లేదా ఆన్‌లైన్ కోచింగ్ సెంటర్ పెట్టి నిరంతర ఆదాయం పొందవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి బాగా సంపాదించవచ్చు.

ఇక ఆరోగ్యం విషయానికొస్తే, మనిషి బతకాలంటే వైద్య సేవలు చాలా ముఖ్యం. ఆసుపత్రుల దగ్గర లేదా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఫార్మసీ (మందుల షాపు) పెడితే స్థిరమైన ఆదాయం వస్తుంది. జెనరిక్ మందులు అమ్మడం ద్వారా కూడా ఎక్కువ లాభం పొందవచ్చు.

45
రియల్ ఎస్టేట్ (Real Estate)

ప్రస్తుతం గ్రామాలు, చిన్నచిన్న పట్టణాల నుండి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన నగరాల్లో ఇళ్లకు, ఆఫీసులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. మీ దగ్గర డబ్బుంటే ఖాళీ స్థలం కొని, అక్కడ భవనం కట్టి అద్దెకు ఇవ్వొచ్చు. ఇళ్లను అద్దెకు ఇవ్వడం ద్వారా లేదా ప్రాపర్టీ కన్సల్టెంట్‌గా పనిచేయడం ద్వారా పెద్దగా కష్టపడకుండానే స్థిరమైన ఆదాయం సంపాదించవచ్చు.

55
ఆన్ లైన్ వ్యాపారాలు (Online Business)

ఆన్‌లైన్ పేమెంట్లు, హోమ్ డెలివరీ వంటి సేవలు అందించి కూడా ఆదాయం పొందవచ్చు. ఏదైనా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన వస్తువులను హోమ్ డెలివరీ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ వ్యాపారం ప్రారంభించే ముందైనా, స్థానిక మార్కెట్ అవసరాలను సరిగ్గా తెలుసుకోవాలి.

గమనిక : పైన చెప్పిన విషయాలు ఇంటర్నెట్, కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఇచ్చాం. మీరు ఏ కొత్త బిజినెస్ మొదలుపెట్టినా, 'కస్టమర్ సర్వీస్'కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. నాణ్యమైన ప్రొడక్ట్‌తో పాటు కస్టమర్లతో మీరు నెరిపే మంచి సంబంధమే మీ వ్యాపారాన్ని దీర్ఘకాలం సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories