Today Gold Rate: రూ.లక్షకు పడిపోతున్న బంగారం, పతనంలో వెండి ...ఈ ఏడాది చివర వరకూ ఇలానే!

Published : Mar 23, 2026, 10:47 AM IST

Today Gold Rate: బంగారం, వెండి కుప్పకూలిపోతోంది. ఈ కాస్త కొద్ది రోజుల్లోనే ఎన్నడూ లేనంతగా పడిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మార్కెట్లు క్రాష్ అయిపోయాయని నిపుణులు అంటున్నారు. 

PREV
14
ఇంకా పతనం చేరుతుందని అంచనా వే

వరుసగా తగ్గుతున్న ధరలు చూస్తుంటే...ఇంకా పతనం చేరుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎప్పుడు లేని విధంగా ఈ బంగారం తగ్గడం, అటు డాలర్ బలపడటం...సేఫ్ హెవెన్‍గా ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గుచూపుతున్నారు. పెట్టుబడులు మొత్తం అమెరికా కరెన్సీపైనే మళ్లుతున్నాయి. సడెన్‍గా పెరిగిన వెండి కూడా దాదాపు రూ.2లక్షల మేర దిగిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయమేంటీ అంటే…బంగారం రూ.లక్షకు పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. 

24
రూ.లక్షా40వేలకు పడిపోయిన పసిడి

24 క్యారెట్లపై ఏకంగా రూ.5,950 పతనం కావడం మామూలు విషయం కాదు. 24 క్యారెట్ల బంగారం రూ.1,40,020కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,450 పతనమై రూ.1,28,350వద్దకు వచ్చింది. వెండిపై రూ.20వేలు తగ్గి రూ.2,30,000కు వచ్చేసింది. 

34
శాంతిస్తున్న సిల్వర్

ఉగాది వారం ముందు నుంచి తగ్గతూ వచ్చిన ధరలు...ఇంకా పడిపోతూనే ఉన్నాయి. మధ్యలో స్వల్ప పెరుగుదల కనిపించినా...మళ్లీ తగ్గిపోయింది. యుద్ధం మొదలైనప్పుడు బంగారం రేట్లు పెరుగుతాయని అంతా అనుకుంటే...పరిస్థితి మారిపోయింది. హర్మూజ్ మూసివేత కారణంగా ముడిచమురు ఎగబాకింది. పసిడి ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడే. ఇప్పుడు తగ్గినా...దీర్ఘకాలిక పెట్టుబడిగా పనికొస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. సో కంగారుపడాల్సిన పనేం లేదంటున్నారు. అయినా కూడా పుత్తడి ఈ స్థాయిలో దిగిరావడంతో మార్కెట్లో గుబులు పుట్టిస్తోంది. కానీ కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే బంగారం కొనేయాలని ఎగబడుతున్నారు. మొన్నటికి మొన్న 24 క్యారెట్ల బంగారం రూ.1.50 లక్షల్లో ఉంటే రూ.1.40లక్షలకు వచేసింది. వెండి కూడా అదే బాటలో కొనసాగుతోంది. 2 నెలల క్రితం సిల్వర్ ధరలు భగ్గుమన్నాయి. నెమ్మదిగా శాంతించి రూ.2,30,000కు వచ్చింది. 

44
బంగారం పెరగడానికి ప్రధాన కారణం మాత్రం డాలర్

డాలర్ పెరగడంతో బంగారం ఖరీదైంది. అందువల్ల డాలర్‍పై పెట్టుబడులు వెళ్లిపోతున్నాయి.చమురు ధరలతో ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. దీంతో పసిడి గిరాకీ తగ్గిపోతోంది. అయితే ఈ మార్పు కొన్నిరోజులే ఉంటుందని...ఈ ఏడాది చివరకు కచ్చితంగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు 10 గ్రాముల బంగారమే రూ.2లక్షలకు చేరొచ్చని భావిస్తున్నారు. ఇక ఇప్పుడు బంగారం కొనడమే మంచిదని సూచిస్తున్నారు. ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి చూసి కొనాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories