8 Seater Cars: 23 కి.మీ. మైలేజ్ ఇచ్చే 8 సీట్ల కార్లు ఇవే: ధర కూడా తక్కువే

8 Seater Cars: కారుల్లో పెద్ద కారంటే.. 7 సీటర్ కారే అని చాలా మంది అనుకుంటారు. కాని 8, 9 సీటర్ కార్లు కూడా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ మైలేజ్ ఇవ్వవని చాలా మంది కొనరు. ఇండియాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే 8 సీట్ల కార్లు కూడా తక్కువగానే ఉన్నాయి. ఉన్న వాటిలో బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, తక్కువ ధరలో దొరికే 8 సీటర్ కార్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

Best Budget 8 Seater Cars in India with High Mileage in telugu sns

మన దేశంలో ఫ్యామిలీ కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కారు కొనాలన్న ఆలోచన వచ్చేది ముందుగా ఫ్యామిలీ మెన్ కి మాత్రమే. చాలా మంది మిడిల్ క్లాస్ వ్యక్తులు ఫ్యామిలీ కోసమే కార్లు కొంటారు. చిన్న ఫ్యామిలీ అయితే 5 సీటర్ కార్లు, కాస్త పెద్ద ఫ్యామిలీ అయితే 7 సీటర్ కార్లు ప్రిఫర్ చేస్తారు. 8 సీటర్ కార్ల విషయానికొస్తే అసలు ఇలాంటి కార్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. 

Best Budget 8 Seater Cars in India with High Mileage in telugu sns

ఎక్కువ ఫ్యూయల్ ఎఫిషియన్సీనిచ్చే 8 సీట్ల కార్లను ఇండియాలో వెతకడం కష్టమే. 5, 7 సీటర్లు మాత్రమే ఎక్కువగా అమ్ముడవుతాయి. ఇండియాలో 8 సీటర్ కార్లు, వాటిల్లోనూ 23 కి.మీ. మైలేజ్ ఇచ్చే కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి టయోటా ఇన్నోవా హైక్రాస్, మారుతి సుజుకి ఇన్విక్టో కార్లు ఈ కోవకు చెందుతాయి. ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాటిల్లో ఇవే బెస్ట్.


టయోటా ఇన్నోవా హైక్రాస్

టయోటా ఇన్నోవా హైక్రాస్ రూ.19.94 లక్షల నుంచి రూ.31.34 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరలో లభిస్తుంది. 8 సీట్ల వేరియంట్ రూ.19.99 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. హైబ్రిడ్ వెర్షన్ 23.24 kmpl మైలేజ్ ఇస్తుంది.

టయోటా ఇన్నోవా హైక్రాస్‌లో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్, సేఫ్టీని పెంచుతాయి.

మారుతి సుజుకి ఇన్విక్టో

మారుతి సుజుకి ఇన్విక్టో రూ.25.51 లక్షల నుంచి రూ.29.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరలో లభిస్తుంది. 8 సీట్ల వేరియంట్ రూ,25.56 లక్షలకు దొరుకుతుంది. ఇది 23 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది.

ఇది కూడా చదవండి కేవలం రూ.11 వేలకే MG కామెట్ EV లేటెస్ట్ మోడల్ ప్రీ బుకింగ్.. కారు ధర కూడా ఇంత తక్కువా?

మారుతి సుజుకి ఇన్విక్టోలో 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి. బెస్ట్ మైలేజ్, ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ కారు పర్ఫెక్ట్ గా నచ్చుతుంది. 

ఇది కూడా చదవండి కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్

Latest Videos

vuukle one pixel image
click me!