Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?

Published : Dec 12, 2025, 05:56 PM IST

Bank Account: ఉద్యోగం చేసే ప్రతీ ఒక్క‌రికీ శాల‌రీ అకౌంట్ ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. క‌రెంట్‌, సేవింగ్స్ అకౌంట్ లాగే ఇదో ప్రత్యేక అకౌంట్‌. అయితే శాల‌రీ అకౌంట్‌లో కొన్ని ప్ర‌త్యేక బెనిఫిట్స్ ఉంటాయ‌ని మీకు తెలుసా.? 

PREV
15
శాలరీ అకౌంట్ అంటే ఏంటి?

సాధారణంగా బ్యాంకులు అందించే సేవింగ్స్, కరెంట్ అకౌంట్‌ల గురించి ఎక్కువ మందికి తెలుసు. ఉద్యోగంలో చేరినప్పుడు కంపెనీలు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఓ శాలరీ అకౌంట్ ఓపెన్ చేపిస్తాయి. నెలజీతం నేరుగా ఈ ఖాతాలో పడుతుంది. ఈ అకౌంట్‌లో అందించే సౌకర్యాలు ఇతర ఖాతాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంటాయి.

25
మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

సేవింగ్స్ అకౌంట్లో తప్పనిసరిగా మినిమం బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే జరిమానాలు పడతాయి. కానీ శాలరీ అకౌంట్‌కు అలాంటి నిబంధన ఉండదు. జీరో బ్యాలెన్స్ ఉన్నా ఛార్జీలు ఉండవు. అత్యవసర పరిస్థితిలో ఖాతాదారులు ఓవర్ డ్రాఫ్ట్ ద్వారా తక్షణ డబ్బులు తీసుకోవచ్చు. ఈ సౌకర్యం ఉద్యోగులకు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది. ఈ సౌక‌ర్యం పొంద‌డానికి బ్యాంకు అధికారుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

35
తక్కువ వడ్డీకే లోన్ల సదుపాయం

శాలరీ అకౌంట్ ఉన్న వారికి బ్యాంకులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాయి. హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి రుణాలు తక్కువ వడ్డీకే అందిస్తాయి. వార్షిక ఫీజులు లేకుండా ఉచిత క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఈ కార్డులపై డైనింగ్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్లు ఎక్కువగా లభిస్తాయి.

45
డిజిటల్ లావాదేవీల విష‌యంలో

శాలరీ ఖాతా ఉన్నవారు నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేయవచ్చు. ఏటీఎం విత్‌డ్రాల్స్‌పై కూడా ఛార్జీలు ఉండవు. ఈ ఖాతాకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా యాడ్ చేస్తారు. ఈ బెనిఫిట్స్ సాధారణ సేవింగ్స్ అకౌంట్లలో అందుబాటులో ఉండవు.

55
సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్‌గా ఎలా మార్చుకోవచ్చు?

మీ సేవింగ్స్ అకౌంట్‌లో జీతం రావడం మొదలైతే కొన్ని రోజుల్లో ఆ ఖాతాను శాలరీ అకౌంట్‌గా మార్చుకునే అవకాశం ఉంటుంది. బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా అప్లై చేస్తే బ్యాంక్ మీ సేవింగ్స్ ఖాతాను శాలరీ అకౌంట్‌గా కన్వర్ట్ చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories