భారత్‌లో బజాజ్ ఆటో ప్లాటినా 110 కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ 2025 వెర్షన్ బజాజ్ ప్లాటినా 110 NXT పేరుతో తీసుకొచ్పిచారు.సరికొత్త మోడల్, ఫీచర్లతో కొత్త బజాజ్ ప్లాటినాను లాంచ్ చేశారు. OBD-2B నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్ లో మార్పులు చేశారు. ఈ అప్‌డేట్‌లు స్టాండర్డ్ మోడల్ కంటే ₹2,600 ధర పెరగడానికి కారణమైంది.
అప్‌డేట్ చేసిన ప్లాటినా 110 NXTలో అంతకు ముందు మోడల్ లో ఉన్న ఇంజన్ ను అందించారు. అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన OBD-2B నిబంధనలకు అనుగుణంగా దీనిలో మార్పులు చేశారు. 115.45cc ఇంజిన్ తో తీసుకొచ్చారు. ఇందులో 8.5 bhp గరిష్ట శక్తి, 9.81 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్ ఇప్పుడు ఫ్యూయల్ ఇంజెక్షన్ యూనిట్ ద్వారా భర్తీ చేశారు.