Gold Rate: బంగారం కొనడానికి గోల్డెన్ టైమ్, భారీగా తగ్గిన ధర, తులం ఎంతంటే?

Published : May 12, 2025, 12:03 PM IST

మొన్నటి దాకా లక్ష దాటిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. మరి, ఈ రోజు బంగారం ఎంత తగ్గింది? ప్రస్తుతం తులం బంగారం ఎంత ఉందో తెలుసుకుందామా...  

PREV
15
Gold Rate: బంగారం కొనడానికి గోల్డెన్ టైమ్, భారీగా తగ్గిన ధర, తులం ఎంతంటే?
నేటి బంగారం, వెండి ధర

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, చాలా రోజులుగా బంగారం  పెరుగుతున్న వస్తున్న విషయం తెలిసిందే. తులం బంగారం లక్ష కూడా దాటేసింది. అయితే, ఈ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడంతో మళ్లీ పరిస్థితులు నార్మల్ గా మారాయి. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా సోమవారం( మే12) న బంగారం ధర భారీగా తగ్గింది. 

 

25
నేటి బంగారం ధర

నేడు 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.165 తగ్గింది. దీంతో ఒక గ్రాము బంగారం రూ.8,880, తులం బంగారం అంటే పది గ్రాముల పసిడి రూ.88,880 కి చేరుతుంది.  ఒక సవరన్ బంగారం  అంటే ఎనిమిది గ్రాముల పసిడి  రూ.71,040కి అమ్ముడవుతోంది.

24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి వరకు 98, 680 ఉండగా.. నేడు భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు రూ.1800 తగ్గి, రూ.96,680కి చేరుకుంది.

35
బంగారం ధర నేడు

అదేవిధంగా, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.130 తగ్గింది. దీంతో 18 క్యారెట్ల బంగారం ఒక గ్రాము రూ.7,320, ఒక సవరన్ రూ.58,560కి అమ్ముడవుతోంది.

45
నేటి వెండి ధర

బంగారం తో పాటు.. వెండి కూడా భారీగా తగ్గుముఖం పట్టడం విశేషం వెండి ధర విషయానికి వస్తే, గ్రాముకు రూ.1 తగ్గింది. ప్రస్తుతం ఒక గ్రాము వెండి రూ.109, ఒక కిలో వెండి రూ.1,09,000కి అమ్ముడవుతోంది.

55
బంగారం ధరల హెచ్చుతగ్గులు

ఈ ధరల హెచ్చుతగ్గులు అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్లోని అస్థిరత కారణంగా ఏర్పడ్డాయని నిపుణులు తెలిపారు. ఈ ధరలు తగ్గడంతో.. చాలా మంది  భారతీయులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ధరలు తగ్గడంతో.. బంగారం కొనుగోళ్లు ఊపందుకునే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories