టీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?

Naga Surya Phani Kumar | Published : May 11, 2025 10:27 PM
Google News Follow Us

దశాబ్దాలుగా దేశ ప్రజల ఫేవరేట్ కంపెనీగా కొనసాగుతున్న టీవీఎస్ కంపెనీ నుంచి త్వరలో మరో కొన్ని అప్డేటెడ్ వెహికల్స్ రానున్నాయి. మైలేజ్ ఎక్కువగా ఇచ్చే సీఎన్జీ, ఈవీ స్కూటర్లతో పాటు ఈవీ బైక్స్ కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. వాటికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం ఇక్కడ ఉంది. 

14
టీవీఎస్ నుంచి కొత్తగా సీఎన్జీ, ఈవీ స్కూటర్లు: ఎప్పుడు లాంచ్ అవుతాయో తెలుసా?

ఖర్చు తక్కువతో కొత్త తరహా రైడ్ అనుభూతిని ఇవ్వడంలో TVS ఎప్పుడూ ముందుంటుంది. గత మూడు నెలలుగా ఈ కంపెనీ వెహికల్స్ మంచి అమ్మకాలు జరుగుతున్నాయి. iQube కంటే తక్కువ ధరలో కొత్త EV మోడల్‌ను పండుగ సీజన్‌లో విడుదల చేసేందుకు టీవీఎస్ ప్రయత్నిస్తోంది.

24

TVS EV పనులు ప్రారంభం 

పండుగ సీజన్‌కు ముందు EV ద్విచక్ర వాహనం మార్కెట్లోకి రానుందని సమాచారం. దీని ధర రూ.90,000 - 1 లక్ష రూపాయల మధ్య ఉండవచ్చు. iQube కంటే తక్కువ ధర ఉండేలా 2.2 KWH బ్యాటరీ లేదా తక్కువ సామర్థ్యం గల బ్యాటరీతో రావచ్చని తెలుస్తోంది. 
 

34

TVS CNG స్కూటర్/RTX 300 

TVS కంపెనీ కొత్త జూపిటర్ CNG వేరియంట్‌ను తయారు చేస్తోంది. పండుగ సీజన్‌కు ముందే CNG వేరియంట్ మార్కెట్ లోకి వస్తుందని అంచనా. సీఎన్‌జీ ట్యాంక్ స్కూటర్ సీటు కింద ఉంటుంది. మిగతా పార్ట్స్ సాధారణ జూపిటర్‌లో ఉన్నవే ఉంటాయి.

44

TVS Apache EV

TVS కంపెనీ కొత్త అడ్వెంచర్ టూరర్ RTX 300 మోడల్ ని త్వరలోనే విడుదల చేయనుంది. కొత్త RTX 300 టెస్టింగ్ కూడా పూర్తయింది. ఇది 299 cc, లిక్విడ్ కూల్డ్ RTX D4 ఇంజిన్‌తో వస్తుంది. 9,000 rpm వద్ద 35 bhp, 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ఆరు స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇదే దీని స్పెషాలిటీ.

Read more Photos on
Recommended Photos