అమెజాన్‌లో ఆఫ్ రేట్‌కే ఎలక్ట్రిక్ స్కూటర్లు: లేట్ చేస్తే మిస్ అయిపోతారు

Published : Oct 19, 2024, 02:48 PM IST

ఏదైనా వస్తువు కొంటే ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవ్వడం మనం చూస్తుంటాం. అయితే అమెజాన్ లో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించారు. స్కూటర్లపై గరిష్టంగా 50% వరకు తగ్గింపు ఇస్తున్నారు. అంటే ఆఫ్ రేట్ కే మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మీ ఇంటికి తెచ్చేసుకోవచ్చు. ఇవే కాకుండా యాక్సెసరీలపై గరిష్టంగా 80% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఏ స్కూటర్ ఎంత ధరకు లభిస్తుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.  

PREV
14
అమెజాన్‌లో ఆఫ్ రేట్‌కే ఎలక్ట్రిక్ స్కూటర్లు: లేట్ చేస్తే మిస్ అయిపోతారు
ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్కౌంట్ ఆఫర్

ఇండియాలో Amazon Great Indian Festival 2024 సందడి ఇంకా కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం ప్రకటించినట్లుగానే ఈ సారి కూడా అమెజాన్ తన కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్లు ఇస్తోంది. Amazon Prime Membersకి ఆఫర్లలో మరింత బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సేల్ అమెజాన్‌లో ఏటా జరిగే అతిపెద్ద ఈవెంట్లలో ఒకటి. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్ మరిన్ని రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా కొత్తగా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.20,000 వరకు డిస్కౌంట్లతో పాటు అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ప్రముఖ బ్రాండ్ల బైక్, స్కూటర్ యాక్సెసరీలపై 80% వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ గాని, బైక్ గాని కొనాలనుకున్న వారికి ఇంతకన్నా బెస్ట్ డీల్ రాదు. ప్రీమియం డాష్ క్యామ్‌లు, టైర్ ఇన్‌ఫ్లేటర్‌లు వంటి అనేక ఉపకరణాలపై ఆఫర్ల తో అమెజాన్ భారీ తగ్గింపుతో వెహికల్స్ అందుబాటులో ఉంచింది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి. 

24
ఇ-బైక్‌ల ఆఫర్ సేల్

AMO ఎలక్ట్రిక్ బైక్ ఇన్స్‌పైరర్ EV బైక్. ఈ బైక్ రూ.68,000 కు లభిస్తోంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 26% డిస్కౌంట్ తో మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే కేవలం రూ.49,890కే లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ బైక్ ను EMI లు కట్టి కొనుగోలు చేయాలనుకుంటే నెలకు రూ.2,500 కడితే సరిపోతుంది. ఇవే కాకుండా ఈ బైక్ పై మరిన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

OLA S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర మార్కెట్ లో రూ.1.3 లక్షలు  ఉంది. అమెజాన్‌లో దాదాపు రూ.1.2 లక్షలకు లభిస్తోంది.

Green Invicta ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రూ.95,000 ధరకు మార్కెట్ లో లభిస్తుండగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ.44,999 కే లభిస్తోంది. అంటే దాదాపు సగం రేటుకే మీరు ఈ స్కూటర్ ను దక్కించుకోవచ్చు. ఇంత తక్కువ ధరకు ఈ స్కూటర్ ఎక్కడా లభించదు. 

 

34
గ్రీన్ ఉడాన్ బైక్

గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీన్ని ముఖ్యంగా వ్యాపారులకు ఉపయోగపడేలా తయారు చేశారు. మీరు వ్యాపారులైతే, మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే ఆలోచనలో ఉంటే ఇదే మంచి అవకాశం. దాదాపు ఆఫ్ రేట్ కే మీరు ఈ స్కూటర్ ను దక్కించుకోవచ్చు. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో రూ.54,000 ధర పలుకుతోంది. ఇదే స్కూటర్ అమెజాన్ సేల్‌లో రూ.26,599 కే లభిస్తోంది. అంటే ఇది సగం రేటు కంటే కాస్త తక్కువనే చెప్పాలి. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తుంది. 25 నుండి 35 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 

 

44
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు మరిన్ని ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఎంచుకోవచ్చు. పర్యావరణానికి అనుకూలమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొత్త డిజైన్లలో లభిస్తున్నాయి. ఈ సేల్ ప్రముఖ బ్రాండ్ల కొత్త మోడల్ బైక్, స్కూటర్‌లను ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుంది.

 

Read more Photos on
click me!

Recommended Stories