తెలుగోళ్లు ఎక్కువగా వాడే నెట్వర్క్ ఏంటో తెలుసా?

First Published Oct 19, 2024, 11:48 AM IST

మీరు ఎక్కడికి వెళ్లినా సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్య రావడం లేదంటే మీరు కచ్చితంగా ఆ టెలికాం సిమ్ ఉపయోగస్తున్నారన్న మాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో 5G నెట్‌వర్క్ సేవలు అందించడంలో ఆ టెలికాం సంస్థ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ కంపెనీ ఏమిటో, అది అందిస్తున్న సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎయిర్ టెల్, ఒడాఫోన్-ఐడియా, రిలయన్స్ తదితర నెట్ వర్క్ లు ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్నాయి. వాటిల్లో కాల్స్, ఎస్ఎంఎస్ లు, ఇంటర్ నెట్ సదుపాయాలను ఎక్కువ రోజులు అందించేలా ప్లాన్ లు అందిస్తున్నాయి. అయితే 5G నెట్‌వర్క్ సేవలు అందించడంలో రిలయన్స్ జియో నెంబర్ వన్ స్థానంలో ఉంది. 5G నెట్‌వర్క్ కవరేజ్ తో పాటు ఇతర సేవలు అందించడంలోనూ జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిస్తోంది. ఈ విషయాన్ని ఓపెన్ సిగ్నల్ అనే సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 

ఇటీవల టెలికాం పరిశ్రమలో టారిఫ్ ధరల పెరుగుదలలు కంపెనీల మధ్య తీవ్ర పోటీని నెలకొల్పాయి. బీఎస్ఎన్ఎల్ టాటా కంపెనీతో కలిసి తన నెట్ వర్క్ ను బలోపేతం చేసుకుంటుండగా, రిలయన్స్ జియో కూడా తమ కస్టమర్లు జారిపోకుండా ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. వీటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన పలు మోడల్స్ తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో జియోభారత్ ప్రారంభించామని ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ పలు సందర్భాల్లో వెల్లడించారు. 
 

Latest Videos


జియో భారత్ కీపాడ్ స్మార్ట్ ఫోన్ 50 % మార్కెట్ షేర్‌ను సాధించింది. అంటే ఆ విభాగంలో దేశవ్యాప్తంగా ఎక్కువమంది ఈ ఫోన్ వాడుతున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ అంటే ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జియో అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది ఓపెన్ సిగ్నల్స్ ప్రకటించింది. అంతేకాకుండా జియో 5G కవరేజ్ టవర్లు 66.7% నెట్‌వర్క్ లభ్యత స్కోర్‌ కనబరుస్తోందని తెలిపింది. జియో తోటి పోటీదారుల కంటే ఎక్కువగా మెరుగైన సేవలు అందిస్తోందని పేర్కొంది. అంటే ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతుల సమయం 5G సేవలను యాక్సెస్ చేయగలుగుతున్నారన్న మాట. 

జియోతో పోల్చితే ఎయిర్ టెల్ 24.4 % మాత్రమే 5G సిగ్నల్స్ అందిస్తోంది. స్థిరమైన 5G కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని ఈ నివేదిక పేర్కొంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో జియో వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. దీని వల్ల వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, వివిధ అప్లికేషన్‌లలో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నారు. 

5G కవరేజ్ అనుభవంలో కూడా ఆంధ్ర, తెలంగాణలలో జియో ముందుంది.  10 పాయింట్ల స్కేల్‌పై జియో 9.0 పాయింట్ల స్కోర్‌ను నమోదుచేసింది. ఎయిర్‌టెల్ కు 7.1 స్కోర్‌ మాత్రమే దక్కింది.  ఈ నంబర్స్ జియో విస్తృతమైన నెట్‌వర్క్‌ కు ఉదాహరణ. ఏ ప్రదేశంలో అయినా నిరంతరాయమైన సేవలను జియో అందిస్తోంది. అదే విధంగా Vodafone Idea(Vi) 3.7 స్కోర్ నమోదు చేసింది. BSNL 1.2 స్కోర్‌లతో బాగా వెనుకబడి ఉంది. 

ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5G కవరేజీని విస్తరించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అయొతే జియో  అత్యుత్తమ 5G లభ్యత, కవరేజీ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. జియో వినియోగదారులు వేగవంతమైన డౌన్‌లోడ్‌లు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండింటిలో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారాలకు మెరుగైన నెట్‌వర్క్ అనుభవం పొందుతున్నారు. 
 

click me!