ఇండియాలో ప్రజలు ఎక్కువగా ప్రయాణించే గవర్నమెంట్ ట్రాన్స్ పోర్ట్ ట్రైన్స్. అందులోనూ స్లీపర్ క్లాస్ లో ప్రయాణించడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. రిజర్వేషన్లు కూడా అవే ఎక్కువగా చేసుకుంటారు. కాస్త ఖర్చు అయినా పర్వాలేదు అనుకున్న వారు ఏసీ బోగీలు ప్రిఫర్ చేస్తారు. ఈ టిక్కెట్స్ దొరకకపోతే జనరల్ బోగీల్లో ప్రయాణించడానికి సిద్ధమవుతారు. అయితే పేద, మధ్య తరగతి వారి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం జనరల్ బోగీలే. ఎందుకుంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చు. అందుకే రైళ్లలో జనరల్ బోగీలు ఎప్పుడూ ఫుల్ రెష్ గా ఉంటాయి. జనరల్ టికెట్ ధర తక్కువ. కానీ సీటు దొరకడం కష్టం. పండగలప్పుడు జనరల్ బోగీలో నిలబడటానికి కూడా చోటు ఉండదు. అయినా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించొచ్చని జనరల్ బోగీల్లో ప్రయాణిస్తారు.
ఇండియన్ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటి. ఇండిపెండెన్స్ కి ముందు వరకు భారత దేశంలో 42 రైల్వే సంస్థలు ఉండేవి. 1951లో ఈ సంస్థలన్ని కలిసి ఇండియన్ రైల్వే ఏర్పడింది. ప్రస్తుతం దేశం నలుమూలల్లో రైల్వే సేవలు ప్రజలకు అందుతున్నాయి. ప్రతి రోజూ మొత్తం 8,702 ట్రైన్స్ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. ప్రతి రోజు సుమారు కోటి యాభై లక్షల మంది రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. రోజురోజుకూ రైల్వే సేవలు వినియోగించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో పండుగల సీజన్‌లో ఏసీ, స్లీపర్ టిక్కెట్లు దొరకడం కష్టంగా మారుతోంది. అందుకే జనరల్ బోగీల్లో ప్రయాణించైనా ప్రజలు వారి గమ్య స్థానాలకు వెళతారు.
ఏ రైలుకైనా సాధారణంగా రెండు నుంచి నాలుగు జనరల్ బోగీలు ఉంటాయి. అవి ఇంజిన్ పక్కన కొన్ని, మిగిలినవి రైలు చివర ఏర్పాటుచేస్తారు. అసలు జనరల్ బోగీలు ఇలా ముందు, వెనక ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బరువు బ్యాలెన్స్ చేయడానికి..
జనరల్ బోగీల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తారు. కాబట్టి ఇతర బోగీలతో పోలిస్తే జనరల్ బోగీల బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. రైలు ముందు, వెనక బోగీలు బరువుగా ఉంటే రైలు మొత్తం బరువు సమానంగా పంపిణీ అవుతుంది. దీని వల్ల ప్రమ ాదాలు జరగకుండా ఉంటాయి. ట్రైన్ వేగంగా వెళ్లేటప్పుడు పట్టాలు తప్పకుండా ఉండటానికి జనరల్ బోగీలే పట్టి ఉంచుతాయి. ఎందుకంటే అవి పాసింజర్స్ తో నిండిపోయి ఉండటం వల్ల బరువును బ్యాలెన్స్ చేస్తాయి.
జనరల్ బోగీలను మధ్యలో అందుకే పెట్టరు..
రైలు మధ్యలో జనరల్ బోగీలు పెడితే ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే జనరల్ బోగీలు ఎప్పుడూ ప్రయాణికులతో నిండుగా, బరువుగా ఉంటాయి. ఇంత బరువున్న వాటిని రైలు మధ్యలో పెడితే ముందు ఉన్న ఇంజిన్, వెనుక ఉన్న గార్డ్ బోగీ తేలికగా మారిపోతాయి. దీంతో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంది. అందుకే జనరల్ బోగీలను ముందు, వెనక పెట్టి, ఏసీ, స్లీపర్ బోగీలను మధ్యలో పెడతారు.
ప్రయాణికుల సౌకర్యం కోసం...
జనరల్ బోగీలలో ఎక్కువ మంది ప్రయాణికులు లోకల్ గా ఉండేవాళ్లు ప్రయాణిస్తుంటారు. వారు ప్రతి స్టేషన్ లోనూ ఎక్కడం, దిగడం చేస్తారు. ఇంత రద్దీగా ఉండే జనరల్ బోగీలను ట్రైన్ మధ్యలో ఉంచితే ప్రయాణికులతో రైల్వే స్టేషన్ మొత్తం రద్దీగా మారిపోతుంది. దీని వల్ల రిజర్వేషన్ చేసుకున్న వారు ట్రైన్స్ ఎక్కడానికి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే జనరల్ బోగీలను చివర లేదా ముందు భాగంలో ఉంచడం వల్ల ఈ రద్దీని తగ్గిస్తారు.
బ్రేక్ వేసినప్పుడు ప్రమాదాలు జరగవు..
ట్రైన్ వెళుతున్నప్పుడు బ్రేక్ వేసినా, జెర్క్స్, స్న్యాపింగ్ వంటివి జరిగినప్పుడు ఇంజన్ పై ప్రభావం పడుతుంది. జనరల్ బోగీలు ఇంజన్ పక్కనే ఏర్పాటు చేయడం వల్ల జెర్క్ ఇచ్చినప్పుడు, బ్రేక్ వేసినప్పుడు ఇంజన్ పార్ట్ కు ఏమీ కాదు. ఎందుకంటే జనరల్ బోగీలు ఎప్పుడూ ప్రయాణికులతో రద్దీగా, బరువుగా ఉంటాయి. ఈ బోగీలు ఇంజన్‌కు దగ్గరగా లేదా చివర్లో ఉంచడం వల్ల బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుంది. రైలుకు మధ్యలో జనరల్ బోగీలు పెడితే బ్రేక్ వేసినప్పుడు ట్రైన్ పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.
ప్లాట్‌ఫాం పొడవు సమస్యలు
రైల్వే స్టేషన్లలోని చాలా ప్లాట్‌ఫామ్స్ పొడవు పరంగా అన్ని రైళ్లకు సరిపోవు. ఈ నేపథ్యంలో ట్రైన్ మధ్యలో జనరల్ బోగీలు ఉంటే అవి ప్లాట్‌ఫారంను తాకే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే ప్రయాణికులకు రైలు ఎక్కడానికి లేదా దిగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొందరు జనరల్ బోగీల్లో కిక్కిరిసి, వేళ్లాడుతూ వెళుతుంటారు. ఇలాంటి జనరల్ బోగీలు ట్రైన్ మధ్యలో ఉండటం వల్ల ప్రయాణికులు ప్లాట్ ఫాం మధ్యలో పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జనరల్ బోగీలు రైలు ఇంజన్ దగ్గర, చివరి భాగంలోనూ ఏర్పాటు చేస్తారు.