Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో కూడా ప్రకటనలు తప్పవు: యాడ్స్ వద్దనుకుంటే ఇలా చేయండి

Published : May 15, 2025, 06:24 PM IST

Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ లో సినిమాలు, వీడియోలు చూసేటప్పుడు మీరు యాడ్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని అమెజాన్ సంస్థే ప్రకటించింది. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది? యాడ్స్ లేకుండా ఉండాలంటే ఎంత రీఛార్జ్ చేయాలి? ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.     

PREV
15
Amazon Prime: ఇకపై అమెజాన్ ప్రైమ్ వీడియోల్లో కూడా ప్రకటనలు తప్పవు: యాడ్స్ వద్దనుకుంటే ఇలా చేయండి

అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో తన స్ట్రీమింగ్ సేవలో కీలక మార్పును ప్రకటించింది. 2025 జూన్ 17 నుంచి ప్రైమ్ వీడియోలో సినిమాలు, టీవీ షోలు చూస్తున్నప్పుడు పరిమిత ప్రకటనలు వస్తాయని తెలిపింది. ఇది ప్రైమ్ సభ్యత్వం ఉన్న వినియోగదారులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. యాడ్స్ లేకుండా వీడియోలు చూడాలనుకుంటే, వినియోగదారులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించింది. 

25

అమెజాన్ ఈ మార్పును వినియోగదారులకు ఇమెయిల్ ద్వారా తెలియజేసింది. ఈ ప్రకటనల ద్వారా పొందిన ఆదాయాన్ని కొత్త కంటెంట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఉపయోగిస్తామని కంపెనీ పేర్కొంది. అయితే అమెజాన్ ప్రైమ్ లో వచ్చే ప్రకటనల టైమ్ టెలివిజన్, ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫారంలలో కంటే తక్కువగానే ఉంటుందని హామీ ఇచ్చింది.

 

35

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వార్షిక సభ్యత్వం అంటే సంవత్సరానికి రూ.1,499 చెల్లించాలి. అయితే ఇప్పుడు యాడ్స్ కూడా ప్రసారం అవుతాయి. ఒకవేళ యాడ్స్ ఫ్రీ అనుభవం కోసం అదనంగా రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ రీఛార్జ్ విలువ రూ.2,198 అవుతుందన్న మాట.

45

మీరు ఇతర OTT ప్లాట్‌ఫారమ్‌లను పరిశీలిస్తే.. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం ప్లాన్ సంవత్సరానికి రూ.1,499 చెల్లించాలి. జియో సినిమా ప్లాన్ సంవత్సరానికి రూ. 499. అయితే ఇందులో యాడ్స్ ప్రసారం అవుతాయి. ఇప్పుడున్న వాటిలో ఒక్క నెట్‌ఫ్లిక్స్ మాత్రం అన్ని ప్లాన్‌లలోనూ యాడ్స్ లేకుండా సేవలు అందిస్తోంది.

 

55

అమెజాన్ ప్రకటించిన ఈ మార్పుతో అమెజాన్ ప్రైమ్ వీడియో భారతదేశంలో తన వ్యూయర్ అనుభవాన్ని, ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వినియోగదారులు ఈ మార్పును ఎలా స్వీకరిస్తారో చూడాలి. రూ.699 కట్టి యాడ్స్ లేకుండా ప్రైమ్ వీడియోలు చూస్తారా? లేక ఇతరు ఓటీటీ ప్లాట్ ఫారంల వైపు వెళ్లిపోతారా అనేది వేచి చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories