Gold Price: ఇప్పుడు బంగారం ధర రూ.70,000 కంటే తక్కువే! కొనాలనుకుంటే వెంటనే కొనేయండి

Published : May 15, 2025, 11:48 AM IST

Gold Price: బంగారం ధరలు ప్రతి రోజూ ఎంతో కొంత తగ్గుతూనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్ లో ఇతర రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడం లేదు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మే 15న బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
Gold Price: ఇప్పుడు బంగారం ధర రూ.70,000 కంటే తక్కువే! కొనాలనుకుంటే వెంటనే కొనేయండి

బంగారం ధరల పెరుగుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లలో వచ్చే హెచ్చుతగ్గులు, ఇన్వెస్టర్ల ఏ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు? ఇలా అనేక అంశాలపై ఆధారపడి ధరలు పెరగడం, తగ్గడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం బంగారం ధరలు రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నాయి. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు తగ్గుముఖం పట్టడమే. పెట్టుబడిదారులు బంగారంపై ఇన్వెస్ట్ చేయడం కంటే ఇతర రంగాలపై పెట్టుబడులు పెడుతున్నారు. 

 

25

బంగారు షాపుల్లో పెరిగిన తాకిడి..

బంగారం ధర పెరిగినా, తగ్గినా నగల దుకాణాల్లో జనం తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతుండటమే దీనికి ప్రధాన కారణం. కాబట్టి ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తే మంచి లాభం వస్తుందనే ఉద్దేశంతో ప్రజలు నగలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 

35

నిన్నటి బంగారం ధర

మే నెల ప్రారంభం నుండి బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. నిన్నటికి ఒక గ్రాము బంగారం ధర సుమారుగా రూ.50 తగ్గి రూ.8,805కి, ఒక సవర బంగారం ధర సుమారు రూ.400 తగ్గి రూ.70,440కి అమ్ముడైంది. దేశంలోని వివిధ నగరాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. 

45

నేటి బంగారం ధర

నేడు (మే 15) హైదరాబాద్ లో 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.7,045గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.195 తగ్గి రూ.8,610లకు అమ్ముడవుతోంది. అదేవిధంగా ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.9,393గా ఉంది. సవర ధర రూ.75,144కి అమ్ముడవుతోంది.

55

వెండి ధర

వెండి ధర ఒక రూపాయి తగ్గి, గ్రాము వెండి రూ.108కి అమ్ముడవుతోంది. ఒక కిలో వెండి రూ.1,08,000కి అమ్ముడవుతోంది. బంగారమైనా, వెండైనా కొనాలనుకొంటే ఇదే మంచి సమయం. త్వరలో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున నమ్మకమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవడం మేలు. 

Read more Photos on
click me!

Recommended Stories