ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వచ్చేస్తోంది. చాలా తక్కువ ధరకే iPhone లను సొంతం చేసుకోవచ్చు. iPhone 14ని, iPhone 16 Pro, Pro Max మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ సేల్ సెప్టెంబరు 23 నుంచి మొదలవుతుంది.
భారతదేశంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలలో ఫ్లిప్‌కార్ట్ ఒకటి. సెప్టెంబరు 23 నుంచి ఫ్లిప్ కార్టులో బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలవ్వబోతోంది. ఇందులో ఆపిల్ ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఐఫోన్ ఎంతోమంది కలల స్మార్ట్‌ఫోన్. దీన్ని మీరు చాలా తక్కువ ధరకే పొందే అవకాశం ఇది. దీనిపై ఈఎమ్ఐ సదుపాయం, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
25
తక్కువ ధరకే ఐఫోన్ 14
ఐఫోన్ 14 బేస్ మోడల్ 128GB స్టోరేజ్‌తో బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, రెడ్ వంటి రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో కేవలం 39,999 రూపాయలకే ఐఫోన్ 14 అమ్మకానికి రాబోతోంది. ఇది నిజానికి చాలా అత్యల్ప ధరగానే చెప్పుకోవాలి. ఐఫోన్ 14లోని శక్తివంతమైన A15 బయోనిక్ చిప్, అద్భుతమైన కెమెరా నాణ్యత, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ ధరలో దీన్ని తప్పనిసరి ఎంపికగా మారుస్తాయి. తమ ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం.
35
ఐఫోన్ 16 ఫోన్లు కూడా
ఐఫోన్ 14 మాత్రమే కాదు, ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై కూడా భారీ తగ్గింపులను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఐఫోన్ 16 Proను లాంచ్ చేసినప్పుడు దాని ధర ₹1,19,900గా ఉంది. దీన్ని మీరు ఇప్పుడు కేవలం ₹70,000 కంటే తక్కువకు పొందవచ్చు. ఐఫోన్ 16 Pro Max అసలు ధర ₹1,44,900గా ఉంది. ఈ సేల్ లో దాని ధర నుండి తగ్గి ₹90,000 కంటే తక్కువకు లభిస్తుంది. ఈ దీపావళి సీజన్ సేల్‌లో, బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి, ఐఫోన్ 16 సిరీస్‌ను దాని అసలు ధరలో సగం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ కొనేందుకు ఇంత కన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23, 2025న ప్రారంభమవుతుంది. ఈ సేల్ లో ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఐఫోన్ కొనుగోలుదారులు Axis బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ దొరుకుతుంది.
55
ఇదే మంచి అవకాశం
ఐఫోన్ కొనేందుకు ఇదే మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. iPHONE14, ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై భారీ తగ్గింపులు వస్తాయి. ఈ సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఆపిల్ ఐఫోన్ డిస్కౌంట్ ఈవెంట్‌గా ఇది నిలిచి పోతుంది. మీ ఐఫోన్ కలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.