రైళ్లలో అత్యవసరంగా అప్పటికప్పుడు ప్రయాణం (Travel) చేయాల్సి రావచ్చు. టిక్కెట్ బుక్ చేసుకుందామన్నా ఒక్కోసారి కుదరదు. అలాంటప్పుడు ఏమి చేయాలి? భారతీయ రైల్వే నియమం ప్రకారం మీరు టిక్కెట్ బుక్ చేసుకోకపోయినా రైలులో ప్రయాణించవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
ఎప్పుడు అత్యవసర పని పడుతుందో తెలియదు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే రైలు మీద ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఏదైనా ముఖ్యమైన పనికి వెంటనే వెళ్లాల్సి వస్తే టికెట్ తీసుకోవడానికి సమయం ఉండదు. ఆన్‌లైన్‌లో టికెట్ దొరక్క పోవచ్చు. ఇలాంటి సమయంలో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చా? ఈ విషయంలో భారతీయ రైల్వే నియమాలు ఏమిటో తెలుసుకోండి.
25
ఇలా ప్రయాణించవచ్చు
మీకు అత్యవసర పరిస్థితులు వస్తే భారతీయ రైల్వే నియమం ప్రకారం ప్రయాణించవచ్చు. మీరు ముందుగా ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కవచ్చు. నిజంగా అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. ప్లాట్‌ఫారమ్ టికెట్ త్వరగా దొరుకుతుంది.
35
ప్లాట్‌ఫారమ్ టికెట్ తో
ప్లాట్‌ఫారమ్ టికెట్ తీసుకుని రైలు ఎక్కి టిటిఇకి మీ సమస్యను చెప్పండి. వారు మీకు అప్పటికప్పుడు టికెట్ ఇస్తారు. కానీ పూర్తి ఛార్జీని చెల్లించాలి. అలాగే జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. టికెట్ లేకుండా ప్రయాణించినందుకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలాగని జనరల్ కోచ్ టికెట్ తీసుకుని స్లీపర్ లేదా ఎసి కోచ్‌లో ప్రయాణించడం వంటివి చేయవద్దు.
లేదా జనరల్ టికెట్ తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. తక్కువ దూరాలు ప్రయాణించేవారు జనరల్ టిక్కెట్ మీద ప్రయాణింవచ్చు. లాంగ్ జర్నీ మాత్రం జనరల్ లో చాలా కష్టం. కానీ మీకు జనరల్ టికెట్ కచ్చితంగా దొరుకుతుంది. అన్ని రైళ్లలోనూ జనరల్ కంపార్ట్‌మెంట్ ఉంటుంది. రిజర్వేషన్ లేకుండా వెళ్లవచ్చు. కానీ జనం ఎక్కువగా ఉంటారు. లాంగ్ జర్నీకి కష్టమైనా, సడన్ ట్రిప్‌కి జనరల్ టికెట్ బెస్ట్.
55
జరిమానా
కొన్నిసార్లు జరిమానా కట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నా రైలులో కన్ఫర్మ్ టికెట్ దొరకడం అనుమానమే. భారతీయ రైలు నియమాల ప్రకారం వెయిటింగ్ టికెట్ తీసుకుని స్లీపర్ కోచ్‌లో ప్రయాణించకూడదు.