Flipkart Sale: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. రూ. 4,499 లకే కొత్త స్మార్ట్‌ఫోన్

Published : Jul 13, 2025, 06:46 PM IST

Ai Plus smartphone: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో పాటు మరిన్ని ఫీచర్లతో కేవలం 4,499 రూపాయలకే భారత్ మార్కెట్ లోకి కొత్త స్మార్ట్స్ ఫోన్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్లు

నెక్స్ట్ క్వాంటమ్ షిఫ్ట్ టెక్నాలజీస్ (NxtQuantum Shift Technologies) అనే కొత్త కంపెనీ నుండి మార్కెట్ లోకి తక్కువ ధరలోనే కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రియల్‌మీ మాజీ సీఈఓ మాధవ్ సేత్ నేతృత్వంలో ఈ కంపెనీ భారత్‌లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన మొబైల్ బ్రాండ్ ఏఐప్లస్ (Ai+) స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. 

ఇటీవల జరిగిన లాంచ్ ఈవెంట్‌లో రెండు మోడల్స్ ను విడుదల చేసింది. వాటిలో ఏఐప్లస్ Pulse (4G), ఏఐప్లస్ Nova 5G విడుదలయ్యాయి. ఈ ఫోన్ల ప్రత్యేకత ఏమిటంటే, ఇవి దేశీయంగా తయారైన స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ NxtQ OS పై పనిచేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్.

26
ఏఐప్లస్ (Ai+) స్మార్ట్‌ఫోన్ రెండు మోడల్స్: ఏఐప్లస్ పల్స్ 4జీ ధర, స్పెసిఫికేషన్స్

Ai+ Pulse ప్రారంభ ధర రూ. 4,499. ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిలోని ఫీచర్లు వివరాలు ఇలా ఉన్నాయి..

  • డిస్‌ప్లే: 6.7 ఇంచ్ HD+ స్క్రీన్, 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది
  • ప్రాసెసర్: Unisoc T615
  • కెమెరా: 50MP డ్యూయల్ రియర్, 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది
  • స్టోరేజ్: 64GB (మెమరీ 1TB వరకు కార్డును సపోర్ట్ చేస్తుంది)
  • బ్యాటరీ: 5,000mAh
  • వేరియంట్లు: రెండు వేరియంట్లు ఉన్నాయి. 4GB+64GB వేరియంట్ ధర రూ.4499, 6GB+128GB (రూ.6,999)
36
Ai+ Nova 5G ప్రారంభ ధర రూ. 7,499

ఏఐ ప్లస్ నోవా 5జీ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ.7,499 గా ఉంది. ఈ ఫోన్ ఫీచర్ల వివరాలు గమనిస్తే..

  • డిస్‌ప్లే: 6.7 ఇంచ్ HD+, 120Hz రిఫ్రెష్ రేట్
  • ప్రాసెసర్: Unisoc T8200
  • కెమెరా: 50MP డ్యూయల్ రియర్, 5MP ఫ్రంట్ కెమెరా
  • స్టోరేజ్: 128GB (మెమరీ 1TB వరకు సపోర్టు చేస్తుంది)
  •  వేరియంట్లు: 6GB+128GB (రూ. 7,999), 8GB+128GB (రూ. 9,999)
46
స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్, డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం

ఈ ఫోన్లు NxtQ OS పై రన్ అవుతాయి. ఇది పూర్తిగా భారత్‌లో అభివృద్ధి చేసిన టెక్నాలజీ. అలాగే, యూజర్ల డేటా భారత ప్రభుత్వ ఎంపానెల్డ్ గూగుల్ క్లౌడ్ రీజియన్స్ లో భద్రంగా స్టోర్ చేయనున్నారు. 

యూజర్ ఇంటర్ఫేస్‌ను వ్యక్తిగతంగా మార్చుకునేందుకు థీమ్ డిజైనర్ టూల్, దేశీయ భాషల మద్దతు వంటి ఎంపికలు ఉన్నాయి. ఈ ఫీచర్లు భారతీయ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తూ డిజైన్ చేశారు.

56
ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలు.. ఆఫర్లు ఇవే

ఈ రెండు మోడల్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి వచ్చాయి.

• Pulse మోడల్ జూలై 12న ఫ్లాష్ సేల్‌లో అందుబాటులోకి వచ్చింది.

• Nova 5G మోడల్ జూలై 13న విక్రయానికి వచ్చింది.

ప్రముఖ బ్యాంకుల ద్వారా డే వన్ ఆఫర్లలో భాగంగా Axis బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తక్కువ ధరలోనే మీరు కొత్త స్మార్ట్ ఫోన్ కోనుగోలు చేయవచ్చు.

66
ఏఐప్లస్ (Ai+) స్మార్ట్‌ఫోన్ల పై ఫ్లిప్‌కార్ట్, కంపెనీ ప్రతినిధులు ఏం చెప్పారంటే?

ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్ మాట్లాడుతూ, “వ్యక్తిగత గోప్యత, డేటా సేఫ్టీ, యూజర్ ఫ్రెండ్లీ కలబోతగా ఏఐప్లస్ ఫోన్ రూపొందించారు. వినియోగదారుల అవసరాలను బాగా తీర్చగలగేలా ఉంది” అన్నారు.

NxtQuantum CEO మాధవ్ సేత్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు భారతీయ అవసరాలకు తగిన ఫోన్‌లు మార్కెట్ లో చూడలేకపోయాము. ఐప్లస్ ఫోన్ భారత వినియోగదారుల చేతుల్లోనే పూర్తి నియంత్రణను తిరిగి ఇస్తుంది. వారి వ్యక్తిగత డేటా భారత్ లోనే స్టోర్ చేస్తారు” అని పేర్కొన్నారు.

ఈ ఫోన్లను బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ టెలిలింక్స్ కంపెనీ నోయిడాలో తయారు చేస్తోంది. పింక్, పర్పుల్, బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories