Saving scheme: మీ ఖాతాలోకి ప్ర‌తీ నెల రూ. 9 వేలు.. రిటైర్ నాటికి ఇలా చేస్తే లైఫ్‌ బిందాస్

Published : Jul 13, 2025, 01:29 PM IST

ప్ర‌తీ ఒక్కరూ ఉద్యోగం లేదా వ్యాపారం నుంచి విర‌మ‌ణ తీసుకోవాల్సిందే. అయితే ఏ ప‌నిచేయ‌క‌పోయినా ప్ర‌తీ నెల రూ. 9 వేలు పొందే అవ‌కాశం ఉంటే భ‌లే ఉంటుంది క‌దూ! మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా.? అయితే మీ స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిందే. 

PREV
15
పోస్టాఫీస్ ప‌థ‌కం

క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును ఎక్క‌డ భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌న్న సందేహం ప్ర‌తీ ఒక్క‌రిలో ఉంటుంది. షేర్ మార్కెట్, రియ‌ల్ ఎస్టేట్ ఇలా ర‌క‌ర‌కాల మార్గాలు ఉంటాయి. అయితే వీటిలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. 

అలాంటి రిస్క్ ఏం లేకుండా ప్ర‌తీ నెల నిర్ధిష్ట మొత్తంలో పొందే అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌. ఇందులో భాగంగానే మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్ పేరుతో ఓ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఎంత పెట్టుబ‌డికి ఎంత ఆదాయం

ఈ పథకంలో వ్యక్తిగతంగా గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు, ఉమ్మడి ఖాతాలో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు కలిసి పెట్టుబడి పెట్టినట్లయితే, నెలకు సుమారు రూ. 9200 వ‌ర‌కు పొందే అవ‌కాశం ఉంటుంది. ఈ వడ్డీ నేరుగా పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో నెలాఖరున జమ అవుతుంది. దీంతో నెలవారీ ఖర్చుల నిర్వహణకు ఎలాంటి టెన్ష‌న్ ఉండ‌దు.

35
స్థిర‌మైన ఆదాయం

ఇప్పటికే అనేక వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించగా, MIS మాత్రం 5 ఏళ్ల వ్యవధి పాటు స్థిరమైన 7.4% వడ్డీని అందిస్తోంది. ఇది మార్కెట్ తీవ్రతలకు ప్ర‌భావితం కాదు. షేర్ మార్కెట్ ఊగిసలాటలతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఖచ్చితంగా ఆదాయం ల‌భిస్తుంది. దీని వల్ల తక్కువ రిస్క్‌తో స్థిర ఆదాయాన్ని కోరుకునే వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

45
నామినీ కూడా

ఈ పథకం ద్వారా పొందే వడ్డీ నేరుగా పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలోకి జమ అవుతుంది. దీని వల్ల ఖాతాదారులు ప్ర‌తీ నెల డ‌బ్బులు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. పోస్టాఫీస్ బ్యాంకింగ్ యాప్‌తో యూపీఐ కూడా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. దీంతో విత్‌డ్రా చేసుకోవ‌డానికి పోస్టాఫీస్ కూడా వెళ్లాల్సిన ప‌నిలేదు. అంతేకాకుండా ఈ పథకంలో నామినీ కూడా పెట్టుకోవ‌చ్చు. దీనివ‌ల్ల‌ భవిష్యత్తులో వారసులకు క్లెయిమ్ ప్రక్రియ సులభంగా ఉంటుంది.

55
పెట్టుబ‌డి పెట్టే ముందు ఈ విష‌యాలు గుర్తుంచుకోవాలి

అయితే ఈ ప‌థ‌కంలో స్థిర‌మైన ఆదాయం వ‌స్తుంద‌నడంలో నిజం ఉన్నా.. కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఉంటాయని గుర్తించాలి. ముఖ్యంగా ద్ర‌వ్యోల్బ‌ణం ఇందులో ప్ర‌ధాన అంశంగా చెప్పొచ్చు. భ‌విష్య‌త్తులో ద్ర‌వ్యోల్బణం కార‌ణంగా మీకు వ‌చ్చే రూ. 9 వేల విలువ త‌క్కువ అవ్వొచ్చు. 

అదే రూ. 15 ల‌క్ష‌ల‌ను రియ‌ల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిట‌ర్న్స్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. కానీ ఇందులో రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి రిస్క్ లేకుండా, ఉద్యోగ విర‌మ‌ణ త‌ర్వాత‌ నెల‌వారీ డ‌బ్బు పొందాల‌నుకునే వారికి మాత్రం పోస్టాఫీస్ స్కీమ్ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories