Vodka Sprite
ఆల్కహాల్ ప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే డ్రింక్‌లో వోడ్కా ఒకటి. మార్కెట్లో ఇప్పటికే వోడ్కాను పలు ఫ్లేవర్స్‌లో తీసుకొచ్చారు. అయితే తాజాగా సరికొత్త ఫ్లెవర్‌ను లాంచ్ చేశారు. ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చిన ఈ డ్రింక్ త్వరలోనే ప్రపంచమంతా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కొకా కోలా యూరోపాసిఫిక్ పార్టనర్స్ 'అబ్సలూట్ వోడ్కా అండ్ స్ప్రైట్ వాటర్‌మెలాన్' పేరుతో టిన్స్‌ను ప్రవేశపెట్టింది.
కొకా-కోలా యూరోపాసిఫిక్ పార్టనర్స్ (CCEP) తాము తయారుచేస్తున్న రెడీ టు డ్రింక్ (RTD) పానీయాల విభాగాన్ని విస్తరిస్తూ, కొత్తగా అబ్సలూట్ వోడ్కా అండ్ స్ప్రైట్ వాటర్‌మెలాన్ వేరియంట్‌ను విడుదల చేసింది. యూకే వ్యాప్తంగా 250 మిల్లీలీటర్ల టిన్స్‌లో లభిస్తోంది. ఇందులో స్ప్రైట్‌కు ప్రత్యేకమైన రుచికి తోడుగా అబ్సలూట్ వోడ్కా స్మూత్‌నెస్ ఉంటుంది. వాటర్‌మెలాన్ ఫ్లేవర్‌ను కూడా ఇందులో మిక్స్ చేశారు.
ఈ కొత్త వేరియంట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 84% మంది వీటిని కొనుగోలు చేయాలనే ఉత్సాహాన్ని చూపించినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక టిన్ డిజైన్‌ను కూడా చాలా ప్రత్యేకంగా చేశారు. RTD విభాగానికి అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ఎలైన్ మహర్ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మేము RTD విభాగంలో కొత్తదనం వైపు అడుగులు వేస్తున్నాం. వాటర్‌మెలాన్ వేరియంట్‌ను పరిచయం చేయడం ఒక గేమ్ చేంజర్. ఇది కేవలం అబ్సలూట్ వోడ్కా అండ్ స్ప్రైట్‌కే కాదు, మొత్తం కేటగిరీకే కొత్త ఊపును ఇస్తుంది' అని చెప్పుకొచ్చారు.
vodka sprite
ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'వోడ్కా నుంచి ఇప్పటికే వచ్చిన రడీ టూ డ్రింక్స్‌కి ప్రాధానత్య ఉంది. లెమన్ లైమ్ మిక్సర్ స్పైట్‌కు మంచి ప్రజాదరణ లభించింది. ఇప్పుడు వాటర్‌మెలాన్ వంటి ఫ్రూటీ ఫ్లేవర్ చేర్చటం వల్ల మేము ‘ఫ్లేవర్ ఇన్నొవేషన్’ అనే విభాగంలో ముందంజలో ఉన్నాం" అన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్‌లో ఆనందంగా గడపడానికి, ఫెస్టివల్స్ నుంచి చిల్‌నైట్స్ వరకూ.. అబ్సలూట్ వోడ్కా అండ్ స్ప్రైట్‌ను కొత్తగా ఆస్వాదించేందుకు ఇది సరైన ఎంపిక" అని ఆమె చెప్పుకొచ్చారు.