మనిషిగా పుట్టిన తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, మళ్లీ వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు.. ఇదే రొటీన్ లైఫ్. ఈ భూమ్మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేసే పనే ఇది. ఈ సైకిల్ లో ఏ ఒక్కటి మిస్ అయినా లైఫే పోయినంత ఫీలైపోతుంటారు. చాలా మంది ఉద్యోగాలు రాక బాధపడుతుంటారు. మరికొందరు పెళ్లిళ్లు కావడం లేదని చింతిస్తుంటారు. ఇంకొందరు పెళ్లి అయినా పిల్లలు పుట్టడం లేదని దిగులు చెందుతుంటారు.
పూర్వం పిల్లలు పిల్లలు లేకపోతే బంధువుల పిల్లలను దత్తత తీసుకొనే వారు. ఇప్పుడు అలాంటివి లేకుండా పిల్లలు లేని వారి కోసం కృత్రిమ విధానంలో పిల్లలు పుట్టించే అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సరోగసీ, ఐసీఎస్‌సీ, ఐవీఎఫ్, ఐయూఐ తదితర పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం IVF విధానం బాగా ప్రచారంలో ఉంది. ఇది అప్డేటెడ్ విధానం కూడా. ఈ పద్ధతిలో ఆడవారి అండాలను బయటకు తీసి, మగవారి వీర్యంతో ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఏర్పడిన ఎంబ్రియోలను ఆడవారి గర్భాశయంలో ప్రవేశ పెడతారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు.
ఇప్పుడు ఈ IVF టెక్నాలజీకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. దీని ద్వారా అత్యంత పకడ్బందీగా పిండోత్పత్తి చేశారు. ఇలా ప్రపంచంలోనే మొదటి సారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో IVF విధానంలో శిశువు జన్మించింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్ లో జరిగింది.
నిపుణులు సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ IVF విధానంలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
సాధారణంగా అండంలోని స్పెర్మ్ ను ఇంజెక్ట్ చేస్తారు. ఈ విధానాన్ని ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ICSI) అంటారు. ఈ విధానంలో 23 దశలు ఉంటాయి. వాటన్నింటినీ డాక్టర్లు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఈ విధానానికి బదులు ఇక్కడ ఆటోమేటెడ్ IVF సిస్టమ్ ను ఉపయోగించారు. ఇలా చేయడం వల్ల ICSI విధానంలో జరగాల్సిన 23 దశలు డాక్టర్లు, నిపుణుల సాయం అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా పూర్తయ్యాయి.
ఆటోమేటెడ్ IVF సిస్టమ్ ద్వారా పిండోత్పత్తి ప్రక్రియకు కేవలం 9 నిమిషాల 56 సెకన్లు మాత్రమే సమయం పట్టిందని హోప్ ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది తెలిపారు. మరి ఈ విధానం అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి వస్తే పిల్లలు కలగలేదన్న బాధ చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు.
ఇది కూడా చదవండి సమ్మర్‌లో కారు టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి