iPhone 17 Series: అదిరే ఫీచ‌ర్ల‌తో ఐఫోన్ 17 సిరీస్.. ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?

Published : Jul 17, 2025, 08:15 PM IST

iPhone 17 Series: ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మాక్స్ మోడళ్ల పై క్రేజీ రూమ‌ర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. త్వ‌ర‌లోనే మార్కెట్ లోకి రానున్న ఐఫోన్ 17 సిరీస్ ధరలు, ఫీచర్లు, కెమెరా, డిజైన్ లీక్‌ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
నాలుగు మోడ‌ళ్ల‌తో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్

టెక్ దిగ్గ‌జం ఆపిల్ తన తదుపరి జెనరేషన్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉండనున్నట్టు లీకులు సూచిస్తున్నాయి. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, టాప్ మోడల్‌గా ఐఫోన్ 17 ప్రో మాక్స్ లేదా అల్ట్రా ఎడిషన్ లాంచ్ కానుంది. 

ఆపిల్ అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు కానీ, చైనా ప్రముఖ లీకర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్లు డైనమిక్ ఐలాండ్‌తో కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తో రాబోతున్నాయని అంచనాలు ఉన్నాయి.

26
సెప్టెంబర్ రెండో వారంలో విడుద‌ల కానున్న ఐఫోన్ 17 సిరీస్

ఆపిల్ సాధారణంగా తన కొత్త ఐఫోన్లను సెప్టెంబర్ మాసంలో రెండో వారం ప్రారంభంలో విడుదల చేస్తుంది. గత సంవత్సరాల లాంచ్ డేట్లను పరిశీలిస్తే, ఈసారి కూడా సెప్టెంబర్ 8 నుండి 10 మధ్యలో ఐఫోన్ 17 సిరీస్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ముందస్తు బుకింగులు సెప్టెంబర్ 12 న ప్రారంభమయ్యే అవకాశం ఉండగా, రిటైల్ సేల్స్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభం కానున్నాయి.

36
ఐఫోన్ 17 సిరీస్ ధ‌ర‌లు: భారత్, దుబాయ్, అమెరికాలో ఎలా ఉంటాయి?

ఐఫోన్ 17 ప్రో మాక్స్ లేదా అల్ట్రా ఎడిషన్ మోడల్‌కు భారీ ధర ఉండే అవకాశం ఉంది. దేశాల వారీగా అంచనా ధరలు గ‌మ‌నిస్తే..

భారత్‌లో: రూ. 1,64,900

అమెరికాలో: $2,300 (సుమారు రూ. 1,91,000)

దుబాయ్‌లో: AED 5,399 (సుమారు రూ.1,22,000)

ఈ ధరలు ఆపిల్ ప్రీమియం మార్కెట్ వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

46
ఐఫోన్ 17 సిరీస్ కెమెరా ఫీచర్లు: సెల్ఫీ కెమెరా పిక్సల్ పెర‌గ‌నుందా?

ఐఫోన్ 17 సిరీస్ బేసిక్ మోడల్‌లో ముందు కెమెరా 12MP నుండి 24MPకి అప్ గ్రేడ్ తో రానుందని లీక్స్ పేర్కొంటున్నాయి. ఇది వీడియోలు, సెల్ఫీల నాణ్యతను మెరుగుపరచనుంది. అలాగే, బ్యాక్ కెమెరాలో కూడా పెర‌గ‌నున్నాయి.

రియర్ కెమెరా వివ‌రాలు గ‌మ‌నిస్తే..

ఐఫోన్ 17: 48MP మెయిన్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా

ఐఫోన్ 17 ప్రో మాక్స్: ట్రిపుల్ కెమెరా సిస్టమ్ (48MP మెయిన్, అల్ట్రా వైడ్, టెలిఫోటో), 8K వీడియో రికార్డింగ్‌కు స‌పోర్టు తో రానుంది.

ఇది ఫోటోగ్రఫీ ప్రియుల కోసం గొప్ప అప్ గ్రేడ్ గా భావించవచ్చు.

56
ఐఫోన్ 17 సిరీస్ డిజైన్, మెటీరియల్

ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లో ఈసారి నాలుగు మోడళ్లలోను అల్యూమినియం ఫ్రేమ్‌ ఉపయోగించనుందని సమాచారం. గత ఐఫోన్లలో ప్రో మోడళ్లకు స్టెయిన్లెస్ స్టీల్ లేదా టైటానియం ఉపయోగించారు. కానీ ఈసారి ప్రో, ప్రో మాక్స్ మోడళ్లలో కూడా అల్యూమినియాన్ని వాడుతూ ఒకే తరహా డిజైన్‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బరువును తగ్గించడానికీ, డిజైన్‌లో ఏకత్వాన్ని తీసుకురావడానికీ చేయబడిన మార్పుగా భావిస్తున్నారు.

66
భారత్‌లో ట్రయల్ ప్రొడక్షన్ మొదలైంది

ఫాక్స్‌కాన్ (Foxconn) అనే ఆపిల్ సరఫరాదారు సంస్థ చైనాలో తయారైన కీలక భాగాలను భారత్‌కు దిగుమతి చేస్తూ, ఐఫోన్ 17 ట్రయల్ ప్రొడక్షన్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆపిల్ వేసిన మరొక పెద్ద అడుగుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో దేశీయంగా తయారైన ఐఫోన్ల సంఖ్య పెరిగే అవకాశముంది.

ఇది ధ‌ర‌ల‌పై కూడా ప్ర‌భావం చూప‌వ‌చ్చు. ప్ర‌స్తుత రూమ‌ర్ల ప్ర‌కారం ఐఫోన్ 17 సిరీస్ మరింత శక్తివంతమైన ఫీచర్లు, మెరుగైన డిజైన్, కెమెరా సామర్థ్యాలతో సెప్టెంబర్‌లో మార్కెట్‌లోకి రానుంది. ధరల పరంగా ప్రీమియం స్థాయిలోనే ఉండే ఈ ఫోన్లు, వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories