ఇంట్లో తయారు చేసిన పొడులను మార్కెట్లో ఎలా అమ్మాలి? ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడే ఎంతో మంది భయంతో ఆగిపోతారు. 100 గ్రాములు, 250 గ్రాముల ప్యాకెట్లలో ఆకర్షణీయంగా గాలి చొరబడని జిప్‌లాక్ సంచులలో ప్యాక్ చేయాలి. ప్యాకెట్‌పై మీ బ్రాండ్ పేరు, తయారీ తేదీ, వాడిన ఆర్గానిక్ పదార్థాలు, FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ నంబర్‌ను పెట్టాలి. ఇది కస్టమర్ల నమ్మకాన్ని పెంచుతుంది. మొదట మీ ఏరియాలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ఆఫీసు ఉద్యోగులు, తెలిసిన స్నేహితులకు శాంపిల్స్ ఇచ్చి రుచి చూపించండి. తరువాత వారి నుంచే మీకు ఆర్డర్లు వస్తాయి.
సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయాలి. తయారీ విధానం వంటివాటిని వీడియోలుగా పోస్ట్ చేసి ఆర్డర్లు పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సైట్లలో, 'స్విగ్గీ మినీస్' వంటి లోకల్ డెలివరీ యాప్‌లలో మీ బ్రాండ్‌ను రిజిస్టర్ చేసి అమ్మకాలను చేయవచ్చు.