Financial Rules: జూన్ 1 నుంచి మారుతున్న 6 కీలక నిబంధనలు ఇవే

Published : May 31, 2025, 12:41 PM IST

జూన్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఎల్పీజీ,  EMI, వంటగది, క్రెడిట్ కార్డులకు సంబంధించిన చాలా విషయాల్లో మార్పులు రానున్నాయి. ఇవి మీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.

PREV
16
ఎల్పీజీ సిలిండర్ ధరలు

ప్రతి నెల ప్రారంభంలో చమురు కంపెనీలు LPG ధరలను సవరిస్తాయి. మే నెలలో గృహ వినియోగ LPG సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. కానీ, వాణిజ్య సిలిండర్ ధర ₹17 తగ్గింది. జూన్ నెలలో మీ వంటగది బడ్జెట్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది చూడాలి.

26
సీఎన్జీ పీఎన్జీ

ఇంధన ధరల్లో LPG మాత్రమే కాదు, ATF, CNG, PNG ధరలు కూడా ప్రతి నెల సవరించడం జరుగుతుంది. మే నెలలో వీటి ధరలు తగ్గాయి. జూన్ నెలలో కూడా ధరలను తనిఖీ చేసుకోవడం అవసరం.

36
క్రెడిట్ కార్డు రూల్స్

మీరు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి! జూన్ 1 నుంచి ఆటో డెబిట్ విఫలమైతే 2% బౌన్స్ ఛార్జీలు వసూలు చేస్తారు. కనీసం ₹450 నుంచి గరిష్టంగా ₹5000 వరకు ఉంటుంది. అంతేకాకుండా, అనేక కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలను 3.5% నుంచి 3.75% (సంవత్సరానికి 45%)కి పెంచనున్నారు.

46
EPFO 3.0

జూన్ 1 నుంచి EPFO 3.0 అనే కొత్త వెర్షన్‌ను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ద్వారా 9 కోట్లకు పైగా EPFO సభ్యులు ATMల ద్వారా PF డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

56
Aadhaar Update:

UIDAI ఆధార్ అప్‌డేట్ కోసం ఉచిత సేవను జూన్ 14 వరకు పొడిగించింది. మీరు ఇంకా మీ ఆధార్‌లోని డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయకపోతే, జూన్ 14 లోపు చేయండి. లేకపోతే, ₹50 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

66
ఫిక్డ్స్ డిపాజిట్

జూన్ మొదటి వారంలో RBI తదుపరి పాలసీ సమావేశం జరగనుంది. రెపో రేటు తగ్గే అవకాశం ఉంది. మీరు FD చేయాలనుకుంటే లేదా లోన్ తీసుకోవాలనుకుంటే, జూన్ 2025 మొదటి కొన్ని రోజులు చాలా కీలకం.

Read more Photos on
click me!

Recommended Stories