September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ సిలిండర్, ఐటీఆర్, ఎఫ్‌డీపై బిగ్ అప్‌డేట్

Published : Aug 27, 2026, 07:14 AM IST

September 1 Rule Changes: సెప్టెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ, ఎఫ్‌డీ, ఐటీఆర్, ఇమ్మిగ్రేషన్ నిబంధనలలో 5 ప్రధాన మార్పులు రానున్నాయి. ఈ కొత్త రూల్స్ మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఆగస్టు 31 లోపు ఈ పనులు పూర్తి చేయకపోతే తిప్పలే.. సెప్టెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్

సెప్టెంబర్ 1 నుంచి సాధారణ పౌరుల రోజువారీ జీవితం, పొదుపు, ఖర్చులపై నేరుగా ప్రభావం చూపే పలు కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు, ఆదాయపు పన్ను, క్రెడిట్ కార్డులు, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించిన అనేక నిబంధనలు మారబోతున్నాయి. వీటిలో కొన్ని మార్పులు సామాన్యులకు ఉపశమనం కలిగిస్తే, మరికొన్ని జేబుకు చిల్లు పెట్టే అవకాశం ఉంది. అందుకే సెప్టెంబర్ ప్రారంభానికి ముందే ఈ నిబంధనల గురించి తెలుసుకోవడం, గడువు ముగిసేలోగా అవసరమైన పనులు పూర్తి చేయడం ఎంతో ముఖ్యం.

26
అంతర్జాతీయ ప్రయాణికులకు స్టాంపింగ్ కిరికిరి లేనట్లే

సెప్టెంబర్ 1 నుంచి భారతదేశం నుండి విదేశాలకు ప్రయాణించే విమాన ప్రయాణికులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇకపై ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో బోర్డింగ్ పాస్‌లపై భౌతికంగా స్టాంపింగ్ వేయవలసిన అవసరం ఉండదు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి, వేగవంతం చేయడానికి బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్‌లో ఎలక్ట్రానిక్ బోర్డింగ్ పాస్ లేదా ప్రింటెడ్ కాపీని ఇమ్మిగ్రేషన్ అధికారులకు చూపిస్తే సరిపోతుంది.

అధికారులు బోర్డింగ్ పాస్‌పై స్టాంప్ వేయరు. దీనివల్ల ప్రయాణికులకు అనవసరమైన శ్రమ తగ్గడమే కాకుండా, సరిగ్గా కనిపించని స్టాంపుల వల్ల వచ్చే సాంకేతిక సమస్యలకు కూడా చెక్ పడుతుంది. ఈ నిబంధన అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారందరికీ వర్తిస్తుంది.

36
ఐటీఆర్ ఫైలింగ్ నిబంధనలు: సరిగ్గా ఎంచుకోకపోతే జరిమానా తప్పదు

వ్యాపారం లేదా ఏదైనా వృత్తి ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు సరైన ఫారమ్‌ను ఎంచుకోవడం ఎంతో కీలకం. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కు సంబంధించి తమ ఖాతాలను ఆడిట్ చేయించాల్సిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను ఆగస్టు 31 లోపు ఫైల్ చేయాల్సి ఉంటుంది.

• ITR-4 (సుగమ్): ఊహాజనిత పన్ను విధానం కింద రిటర్న్‌లు ఫైల్ చేసే వ్యాపారవేత్తలు, అలాగే రూ.50 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్-4 వర్తిస్తుంది.

• ITR-3: రూ.50 లక్షలకు పైబడి ఆదాయం ఉన్నవారు, పూర్తి ఖాతాల పుస్తకాలను నిర్వహించేవారు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ట్రేడింగ్‌లో పాల్గొనేవారు ఐటీఆర్-3 ఫారమ్‌ను ఉపయోగిస్తారు.

46
బ్యాంక్ ఎఫ్‌డీ నిబంధనలలో పారదర్శకత

ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి బ్యాంకులు కొన్ని కీలక మార్పులను తీసుకొస్తున్నాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రూ.3 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను బ్యాంకులు ప్రతి పనిదినం ఉదయం 10:10 గంటలలోపు తమ అధికారిక వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రచురించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఒకే రోజున ఒకే మొత్తానికి వేర్వేరు బ్యాంక్ బ్రాంచ్‌లు వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేయడానికి వీలుండదు. అయితే పెద్ద మొత్తంలో ఉండే డిపాజిట్లకు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. సామాన్యులు చేసే చిన్న చిన్న ఎఫ్‌డీలపై ఈ నియమం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు.

56
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఇ-కేవైసీ గడువు ముగింపు

వంట గ్యాస్ వినియోగిస్తున్న కుటుంబాలకు ఇది ముఖ్యమైన సమాచారం. ఎల్‌పీజీ కనెక్షన్ కోసం ఆగస్టు 23 నాటికి ఇ-కేవైసీ పూర్తి చేయని కస్టమర్లకు ఆగస్టు 31 వరకు గడువు పొడిగించారు. అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇ-కేవైసీ చేసేందుకు అవకాశం ఉండదు. ఆధార్ బయోమెట్రిక్ ఆధారిత ఈ ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం తప్పనిసరి. ఒకవేళ దీనిని పూర్తి చేయకపోతే, గృహ అవసరాల సబ్సిడీ రేటుకు సిలిండర్ లభించకపోవచ్చు. ఇండియన్ ఆయిల్, హెచ్‌పీసీఎల్, బిపిసిఎల్ వంటి ఆయిల్ కంపెనీలు ఇప్పటికే కస్టమర్లకు మెసేజ్‌లు పంపి ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరాయి.

66
సెప్టెంబర్‌లో మారనున్న ఇతర ధరలు, ఛార్జీలు

పైన పేర్కొన్న వాటితో పాటు సెప్టెంబర్ ప్రారంభంలో మరికొన్ని కీలక మార్పులు కూడా చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రతి నెల ఒకటో తేదీలాగే సెప్టెంబర్ 1న కూడా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే విమాన ఇంధనం ధరలు, బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు, ఏటీఎం వినియోగ ఛార్జీలు మారే అవకాశం ఉంది. ఇవన్నీ సాధారణ పౌరుల నెలవారీ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తాయి కాబట్టి సెప్టెంబర్ మొదటి వారంలో వెలువడే కొత్త నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories