Worlds Toughest Job: లైట్ ఆన్ ఆఫ్ చేస్తే చాలు రూ. 30 కోట్ల సాలరీ.. అయినా జాబ్ ను వద్దన్నారు? ఎందుకు?

Published : Jun 29, 2025, 06:17 PM IST

Worlds Toughest Jobs: అలెగ్జాండ్రియా ఫారోస్ లైట్‌హౌస్‌కి కీపర్‌గా ఉన్నవారికి ఏకంగా రూ.30 కోట్లు జీతం ఇచ్చేవారు. ఈ జాబ్ ను ప్రపంచంలోని కఠినమైన ఉద్యోగంగా పరిగణిస్తారు. ఎందుకో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
రూ. 30 కోట్ల జీతం.. ప్రపంచంలో కఠినమైన ఉద్యోగం

The Pharos of Alexandria lighthouse: ఇప్పుడు ఉద్యోగాల కోసం వేట మొదలైంది. కానీ, ఒకప్పుడు రూ.30 కోట్ల వేతనం ఇస్తూ.. లైట్ ఆన్ ఆఫ్ చేసే ఉద్యోగం చేయడానికి రమ్మంటే చాలా మంది ముందుకు రాలేదు. ఈ ఆసక్తికరమైన జాబ్ వివరాలు మీకోసం.. 

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సమీపంలో ఒకసారి ప్రసిద్ధ నావికుడు కెప్టెన్ మోరేసియస్ ఓ భారీ తుఫానును ఎదుర్కొన్నారు. ఆ ప్రాంతంలో పైకి కనిపించకుండా ఉన్న రాళ్లతో ఆయన నౌక బోల్తాపడి, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకలకు ఓ మార్గదర్శక కాంతి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక లైట్ హౌస్ (దీప స్తంభం) ను నిర్మించారు.

ఆ సమయంలో అక్కడి పాలకుడు ఈ అవసరాన్ని గుర్తించి ఓ ప్రముఖ శిల్పిని పిలిపించారు. సముద్ర మధ్యలో ఓ భారీ టవర్‌ను నిర్మించి, దానిలో కాంతిని వెలిగించి, నౌకలను ప్రమాదకర రాళ్ల నుంచి దూరంగా నడిపించేందుకు ఆదేశించారు.

26
ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లైట్ హౌస్ నిర్మాణం

ఈ దీపస్తంభాన్ని అలెగ్జాండ్రియా పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఫారోస్ దీవిపై నిర్మించారు. ఇది ఆ కాలంలో అద్భుతమైన ఇంజినీరింగ్ సాహసంగా పరిగణించారు. దీపస్తంభం లోపల పెద్దమొత్తంలో నిప్పు వెలిగించి, దాని కాంతిని లెన్స్‌ల సాయంతో దూర ప్రాంతాలకు పంపే విధంగా నిర్మాణం జరిగింది.

36
ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా దీపస్తంభ ప్రాముఖ్యత ఏమిటి?

ఫారోస్ దీపస్తంభం ప్రపంచంలోని తొలి లైట్‌హౌస్‌గా చరిత్రలో నిలిచింది. దీని వల్ల ఎన్నో నౌక ప్రమాదాలు నివారించారు. దీని విజయంతో తరువాత కాలంలో తీరప్రాంతాల్లో, దీవుల్లో, శిలాసముద్రాల్లో లైట్‌హౌస్‌లు చాలా నిర్మించారు. విద్యుత్ ఆవిష్కరణ అనంతరం ఇవి విద్యుత్ దీపాలతో మరింత అభివృద్ధి చెందాయి.

46
ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లైట్‌హౌస్ కీపర్ పనికి భారీ వేతనం

ఈ దీపస్తంభంలో కీపర్ పనిగా కేవలం కాంతిని ఆన్, ఆఫ్ చేయడం ఉండేది. అయితే, ఈ పని ప్రపంచంలోనే కఠినమైనదిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉంటూ కేవలం దీపం వెలిగించడం, ఆపివేయడం కోసం వార్షిక జీతం ఏకంగా రూ.30 కోట్లు ఇచ్చేవారు.

అయితే, ఇక్కడి ఉద్యోగానికి ఆ వేతనం చాలా తక్కువనీ, ఈ ఉద్యోగాన్ని చేయడానికి చాలా మంది ముందుకు రాలేదు. దీనికి ప్రధాన కారణం ఈ ఉద్యోగం ఒంటరిగా, సముద్ర మధ్యలో, ఎప్పుడైనా వచ్చే తుఫాన్లను తట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉండటమే. నిత్యం ప్రాణాల కోసం పోరాటం లాంటిదని చెప్పొచ్చు. 

56
ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లైట్‌హౌస్ కీపర్ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు ఏమిటి?

ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా లైట్‌హౌస్ ను ఎప్పుడూ భారీ సముద్ర అలలు తాకుతూ ఉండేవి. కొన్నిసార్లు ఇది పూర్తిగా నీటిలో మునిగిపోయే పరిస్థితి ఉండేది. భారీ అలలతో చాలా సార్లు మునిగిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 

అంటే ఇక్కడ ఒంటరిగా ఉద్యోగం చేసే కీపర్ ప్రాణం ఎప్పుడూ ప్రమాదంలోనే ఉండేది. ఈ ఉద్యోగంలో పని తక్కువగానే ఉన్నా.. ఒంటరితనంతో పాటు ఈ శారీరక, మానసిక ఒత్తిడిని తట్టుకోవడం చాలా మందికి సాధ్యపడలేదు.

66
ప్రపంచంలో అత్యంత కఠినమైన ఉద్యోగం

రూ.30 కోట్లు జీతం ఉన్నా చాలా మంది చేయడానికి ముందుకు రాలేదు. అందుకే ఇది ప్రపంచంలో అత్యంత కఠినమైన ఉద్యోగంగా మిగిలిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories