Business Idea: 100 గ‌జాల స్థ‌లం ఉన్నా చాలు.. నెల‌కు రూ. 50 వేలు సంపాదించొచ్చు. బెస్ట్‌ బిజినెస్ ఐడియా

Published : Jun 29, 2025, 10:13 AM ISTUpdated : Jun 29, 2025, 07:41 PM IST

వ్యాపారం చేయాల‌ని చాలా మందికి ఉంటుంది. కానీ స‌రైన ఐడియా, స‌రిప‌డ పెట్టుబ‌డి లేక చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే త‌క్కువ పెట్టుబ‌డితో కూడా కాసులు కురిసే వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మున‌గాకు వ్యాపారం

మున‌గ చెట్ల‌ను పెంచ‌డం ద్వారా భారీగా లాభాలు ఆర్జించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం వీటికి మార్కెట్లో భారీగా డిమాండ్ ఉంది. మునగ చెట్ల‌ను పెంచ‌డానికి ఎక‌రాలు, ఎక‌రాల స్థ‌లం అవ‌స‌రం లేదు. త‌క్కువ స్థ‌లంలో కూడా ఈ చెట్ల‌ను పెంచ‌వ‌చ్చు. 100 గ‌జాల స్థ‌లంలో కూడా వీటిని సాగు చేయొచ్చు.

25
మున‌గ‌తో డ‌బ్బు ఎలా వ‌స్తుంది.?

మునగ (Moringa) చెట్టు మనకు ఆరోగ్యమే కాదు, ఆదాయాన్ని కూడా ఇస్తుంది. ఆకులు, కాయలు, పూలు, విత్తనాలు ఇలా అన్నింటినీ మార్కెట్‌లో అమ్మొచ్చు. ఇవి సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడటంతో దేశవిదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఒక్క మునగ ఆకు పొడి (Moringa Leaf Powder)నే కిలోకు రూ. 1,000 వరకు విక్ర‌యించ‌వ‌చ్చు.

35
పెట్టుబ‌డి, లాభాలు.?

సొంతంగా స్థ‌లం ఉంటే కేవ‌లం రూ. 5 వేల పెట్టుబ‌డితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. సుమారు నెల‌కు రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వ‌ర‌కు సంపాదించ‌వ‌చ్చు. మున‌గ చెట్టు ద్వారా వ‌చ్చే ప‌దార్థాల‌కు యూరప్, అమెరికా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది.

ముఖ్యంగా మునగ ఆకుల పొడిని హెల్త్ డ్రింక్‌లకు, కూరల్లో వేసేందుకు ఉప‌యోగిస్తున్నారు. అలాగే మున‌గ కాయ‌ల‌ను మార్కెట్లో అమ్మొచ్చు. మునగ టీ పాకెట్లు డిటాక్స్‌, ఇమ్యూనిటీ బూస్ట్ కోసం హర్బల్ టీగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. మునగ ఆయిల్ విత్తనాల నుంచి తీసే ఆయిల్ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉపయోగపడుతుంది.

45
ఎలా ప్రారంభించాలి.?

ఈ వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెటింగ్‌పై స‌రైన అవ‌గాహ‌న పెంచుకోవాలి. ఆన్‌లైన్‌లో ప్రొడ‌క్ట్స్‌ను ఎలా విక్ర‌యించవ‌చ్చ‌న్న విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకోవాలి. ముఖ్యంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులో వీటిని ఎలా సేల్ చేస్తున్నార‌న్న విష‌యాలు తెలుసుకోవాలి. అలాగే వాట్సాప్ ఛాన‌ల్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ వంటి వేదిక‌ల ద్వారా వ్యాపారం చేసుకోవ‌చ్చు.

55
కావాల్సిన లైసెన్స్‌లు

FSSAI లైసెన్స్ ఫుడ్ ప్రొడక్ట్స్‌కి తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక మీ వ్యాపారం రూ. 20 ల‌క్ష‌లు దాటితే జీఎస్టీ స‌ర్టిఫికేష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు ప్ర‌త్యేకంగా స్టోర్ ఏర్పాటు చేయాల‌నుకునే ఆలోచ‌న ఉంటే అందుకు సంబంధించిన లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

నాణ్య‌త పాటించాలి

మునగతో డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, కానీ క్వాలిటీకి ప్రాధాన్యత ఇవ్వాలి. సబ్జెక్ట్ మీద అవగాహన, కస్టమర్ ట్రస్ట్, మంచి మార్కెటింగ్ ఉంటే ఈ చిన్న బిజినెస్‌నే బ్రాండ్‌గా మార్చుకోవచ్చు. అలాగే ప్ర‌స్తుతం ట్రెండింగ్‌లో ఉన్న రీల్స్ వంటి వాటి ద్వారా మీ వ్యాపారాన్ని ప్ర‌మోట్ చేసుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories