ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు: మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేయండి

Published : May 13, 2025, 11:23 AM IST

Free Electricity Scheme: విద్యుత్తు ఛార్జీల మోతతో ప్రతి నెలా కరెంట్ బిల్లు కట్టలేకపోతున్నారు కదా.. అందుకే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 125 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ పథకానికి మీరు అర్హులో కాదో తెలుసుకోవాలంటే ఇక్కడ పూర్తి వివరాలు చదవండి.

PREV
15
ప్రతి ఇంటికి 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు: మీరు అర్హులేనా? ఇక్కడ చెక్ చేయండి

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు అనేక రాయితీలను ప్రకటిస్తూ ఆర్థిక సహాయం అందిస్తోంది. అనేక రాయితీలు, ఉచిత సేవలను ప్రభుత్వం అందిస్తోంది. రేషన్, గ్యాస్, వైద్యం, ఇళ్లు ఇలా ప్రతి కుటుంబానికి అవసరమైన వాటన్నింటిపై రాయితీలు అందిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మోడీ ప్రభుత్వం మరో ప్రకటన చేయనుంది.

25

125 యూనిట్ల ఉచిత విద్యుత్తు

దేశవ్యాప్తంగా విద్యుత్తు ఛార్జీల మోత మోగిపోతోంది. అసలే వేసవి కావడంతో ఇప్పుడు విద్యుత్తు వినియోగం మరింత పెరిగిపోయింది. దీంతో బిల్లులు కూడా రెట్టింపై వస్తున్నాయి. విద్యుత్ ఛార్జీల పెరుగుదల, ఇంధన పొదుపుపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 125 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించేందుకు సన్నద్ధమవుతోంది.

35

ఎవరికి ఈ రాయితీ లభిస్తుంది?

ఆర్థికంగా వెనుకబడిన వారు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, నెలకు 150 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించేవారు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వికలాంగులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికుల వితంతువులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఈ ప్రయోజనాన్ని పొందడానికి ముందుగా రాష్ట్ర విద్యుత్ బోర్డు వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి, సబ్సిడీ దరఖాస్తు ఫారమ్‌ను నింపాలి. తర్వాత అవసరమైన పత్రాలను సమర్పించాలి.

45

తెలంగాణ ప్రజలకు ఈ పథకం వర్తిస్తుంది..

మీరు అర్హులైతే అధికారులు అడిగిన అన్ని పత్రాలను సమర్పించాలి. వాటిని ప్రభుత్వ అధికారులు చెక్ చేసి  ధృవీకరిస్తారు. ఆ తర్వాత మీకు నెలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ లభిస్తుంది. ఈ సబ్సిడీ స్కీమ్ త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల ప్రజలు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.

55

ఉచిత విద్యుత్ లిమిట్ దాటితే బిల్లు కట్టాల్సిందే..

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 125 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగిస్తే ఎటువంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ వినియోగిస్తే మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఈ విషయంపై త్వరలోనే పూర్తి సమాచారంతో ప్రకటన వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories