మార్కెట్లో ఉన్న 112 మందులు నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్, ప్రభుత్వం షాకింగ్ నివేదిక

Published : Oct 24, 2025, 05:04 PM IST

Medicines: ఏదైనా అనారోగ్య సమస్య వస్తే మార్కెట్లో ఉన్న మందులను కొని వేసుకుంటాం. కానీ వాటిలో ఎన్ని నాణ్యతా పరీక్షలను విజయవంతంగా దాటాయో మాత్రం తెలుసుకోలేము. ఒక నివేదిక ప్రకారం మార్కెట్లో ఉన్న 112 రకాల మందులు క్వాలిటీ టెస్టును ఫెయిల్ అయ్యాయి. 

PREV
14
షాకింగ్ నివేదిక

ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మందులను వాడతాం.. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక షాకింగ్ నివేదికను అందించింది. సెప్టెంబర్ 2025లో మార్కెట్లో ఉన్న మందులను పరీక్షించారు. వాటి నాణ్యతను తనిఖీ చేశారు. కానీ వాటిలో 112 మందులు నాణ్యతా పరీక్షలను ఫెయిల్ అయ్యాయి. అంటే వాటిని వాడడం వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ 112 నమూనాలలో 52 నమూనాలను సెంట్రల్ ఔషధ లేబరేటరీస్ పరీక్షించింది. మిగతా వాటిని రాష్ట్ర లేబరేటరీస్ పరీక్షించాయి. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు మీడియాకు అందించారు.

24
ప్రతి నెలా తనిఖీలు

ప్రతి నెలా మందుల నాణ్యతను తనిఖీ చేసే బాధ్యత ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రయోగశాలలో ఈ తనిఖీలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ లో తనిఖీ నిర్వహించగా 112 మందుల నాణ్యత ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వాటిలో సరైన మొత్తంలో రోగాన్ని నివారించే క్రియాశీలకమైన పదార్థం లేదని తేలింది. ఈ లోపం కేవలం ఒక బ్యాచ్ మందుల్లోనే లేదని..ఆ కంపెనీ నుండి వచ్చిన ఇతర బ్యాచుల మందుల్లో కూడా అవసరమైన పదార్థం లేనట్టు బయటపడింది.

34
ఎంత డేంజరో

ఈ 112 నమూనాలను తనిఖీ చేస్తున్నప్పుడు ఒక ఔషధం పూర్తిగా నకిలీదని తేలింది. అది చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మందుల కంపెనీ తయారు చేస్తోంది. ఆ మందుల కంపెనీకి కనీసం లైసెన్స్ కూడా లేదు. ఆరోగయం మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తును కూడా ప్రారంభించింది. మందుల నాణ్యత తనిఖీ చేయడం అనేది సాధారణ ప్రక్రియ. కానీ అది సరైన రీతిలో జరిగితేనే ఇలాంటి నకిలీ మందులు బయటపడతాయి.

44
ఈ జాగ్రత్తలు తీసుకోండి

మీరు మందులను కొనేటప్పుడు ప్రిస్క్రిప్షన్ కచ్చితంగా తనిఖీ చేయండి. ప్రిస్క్రిప్షన్లో రాసిన మందుని మాత్రమే తీసుకోండి. అలాగే ఆ మందు పై తయారీ తేదీని కూడా చెక్ చేయండి. లైసెన్సు పొందిన ఔషధ దుకాణం నుండి మాత్రమే కొనండి. ఔషధ నాణ్యతపై మీకు ఏమైనా సందేహంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Read more Photos on
click me!

Recommended Stories