Tesla Car Model Y : అదరగొట్టే ఫీచర్లతో.. భారత్ లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ.. ధర ఎంత?

Published : Jul 15, 2025, 01:11 PM IST

Tesla Model Y Launch in India: ఎట్టకేలకు భారతదేశంలో టెస్లా అడుగుపెడుతోంది. ఎలక్ట్రిక్ కార్లలో విస్తృతంగా పేరు తెచ్చుకున్న ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా. ఈరోజు జూలై 15, 2025న భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. టెస్లా ప్రత్యేకత ప్యూచర్ ఇవే..

PREV
19
సాంకేతికత అద్భుతం టెస్లా

అమెరికా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా (Tesla) ఎట్టకేలకూ భారతదేశంలో ఎంట్రీ ఇచ్చింది. ఏళ్ల నిరీక్షణ తర్వాత కంపెనీ మంగళవారం మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో తన మొదటి షోరూమ్​ను ప్రారంభం కానున్నది. భవిష్యత్తు అవసరాలకు అనుకూలంగా టెస్లా 'మోడల్ Y' కారును రూపొందించబడింది. ఈ స్మార్ట్ కారును సాఫ్ట్‌వేర్ ఆధారంగా రూపొందించిన OTA నవీకరణలతో మార్కెట్ లోకి తీసుకవచ్చారు. మొబైల్ ఫోన్‌ల మాదిరిగానే మీ కారు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కారు ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసుకుందాం .

29
అత్యధిక రేంజ్

టెస్లా కార్లు ప్రపంచంలోనే అత్యధిక డ్రైవింగ్ రేంజ్‌ను అందుకునే ఎలక్ట్రిక్ వాహనాల్లో ముందుంటాయి. టెస్లా 'మోడల్ Y' ని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 750 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే టెస్లా చాలా మెరుగైనది. 

39
4.3 సెకన్లలో100 కిమీ వేగం

టెస్లా ఎలక్ట్రిక్ కార్లు కేవలం స్మార్ట్‌గానే కాకుండా.. అసాధారణ వేగాన్ని సెకన్ల వ్యవధిలోనే అందుకుంటాయి. భారతదేశంలో అడుగుపెట్టిన టెస్లా 'మోడల్ Y' (Model Y Long Range) వేరియంట్ కేవలం 4.3 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇలాంటి సామర్థ్యం సూపర్‌కార్లకే ఉంటుంది.

49
టచ్‌స్క్రీన్ తో కంట్రోల్

టెస్లా కార్ల ఇంటీరియర్ చాలా క్లీన్,  మినిమల్‌గా ఉంటుంది. 15.4 అంగుళాల టచ్‌స్క్రీన్ దీని ప్రత్యేకత. దీంతో నావిగేషన్, ఎయిర్ కండిషనింగ్, మ్యూజిక్, డ్రైవ్ మోడ్‌ వంటి అన్ని ఫీచర్స్ ను కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్ డిజైన్ కారు ప్రయాణం ఓ అద్భుతమనే చెప్పాలి.  

59
ఆటోపైలట్ మోడ్

టెస్లా ఆటోపైలట్ ఫీచర్ అత్యంత ప్రజాదరణ పొందిన డ్రైవర్ అసిస్టెంట్. ఈ కారులో సెన్సార్లు, కెమెరాలు, AI ఆధారంగా ఆటోపైలట్ మోడ్ ను యాక్టివ్ చేయవచ్చు.  ట్రాఫిక్‌లో స్వయంగా కారు నడపగలగే సామర్థ్యం దీని సొంతం. కానీ, . ప్రస్తుతం ఈ ప్యూచర్ ఇండియాలో అందుబాటులో లేదు.

69
పర్యవరణ హితం- జీరో ఎమిషన్

టెస్లా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం. అంటే.. పెట్రోల్,  డీజిల్ వినియోగం లేదు, పొగ రాదు. ఇది జీరో ఎమిషన్ వాహనం,  పర్యవరణానికి ఎలాంటి కాలుష్యం కలిగించదు. పర్యావరణాన్ని కాపాడే దిశగా ఇదొక ముందడుగు. 

79
8. టెస్లా యాప్- మొబైల్ తో కంట్రోల్

టెస్లా కారును మీరు మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు,  లాక్, అన్‌లాక్  బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్, ఎయిర్ కండిషనింగ్ ఆన్ వంటి అనేక ఫీచర్లను యాప్ ద్వారానే నియంత్రించవచ్చు. ఈ స్మార్ట్ ప్యూచర్స్ .. కార్ లవర్స్ కు కొత్తగా అనుభూతిని కలిగిస్తుంది.

89
ప్రతి నెలా స్టాప్ వేర్ అప్డేట్

టెస్లా కార్లు ప్రతి నెలా OTA (Over-The-Air) ద్వారా తమ సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తుంది. ఇందులో కొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ రావడం వల్ల కారు పనితీరు మరింత మెరుగుపడుతుంది. ఇలా సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండానే మీ కారు మరింత స్మార్ట్‌గా మారుతుంది. 

99
ధర ఎంత?

టెస్లా కార్లు కేవలం టెక్నాలజీ పరంగానే కాదు..  స్లీక్, సింపుల్, సైన్స్ ఫిక్షన్ సినిమా లాంటి లుక్‌ను కలిగి ఉంటాయి. వీటి డిజైన్ ఆకర్షణీయంగా, ప్యూచర్ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఇండియాలో టెస్లా  'మోడల్ Y' కారు ధర రూ. 59.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రకటించారు.  ఈ కారు రియర్-వీల్ డ్రైవ్ (RWD) వెర్షన్‌లో మాత్రమే లభిస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories