Second Hand Cars: ఢిల్లీలో కొత్త కార్లకు ధీటుగాా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తక్కువ బడ్జెట్లలో టాప్ మోడల్ కార్లు రావడంతో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. పైగా ఈ కార్లకు బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి.
భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెటింగ్ జోరుగా సాగుతుంది. కొత్త కార్ల అమ్మకాల కంటే పాత కార్ల అమ్మకాలే వేగంగా సాగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఢిల్లీలో పాత వాహనాలకు ఇంధన నిషేధం విధించడమే. నవంబర్ 1, 2025 నుంచి ఎండ్ ఆఫ్ ఫిట్‌నెస్ (EOF) నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. పాత వాహనాలకు ఇంధన నిషేధం విధించబడుతోంది.
డీజిల్ కార్లకు 10 ఏళ్ళు, పెట్రోల్ కార్లకు 15 ఏళ్ళ గడువు ఉండటంతో పాత కార్ల రీసేల్ వాల్యూ భారీగా పడిపోయింది. కార్ల ధరలు సుమారు 50% వరకు తగ్గిపోవడంతో యజమానులు, సెకండ్ హ్యాండ్ డీలర్లు నష్టపోతున్నారు. ఈ EOF నిషేధం కారణంగా దాదాపు 60 లక్షల వాహనాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
24
ఇదే బెస్ట్ టైం..
ఢిల్లీలో వాహనాలపై నిషేధం నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. వాణిజ్య, పారిశ్రామిక వర్గాల ప్రతినిధి బ్రిజేష్ గోయల్ వెల్లడించిన ప్రకారం.. పాత కార్లపై చర్యలు మొదలైనప్పటి నుంచి ధరలు 40% నుంచి 50% వరకు తగ్గాయి. కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం, మంచి అవకాశం కూడా.
34
చాలా తక్కువ ధరకే..
ఢిల్లీలో పాత వాహనాలకు ఇంధన నిషేధ నిబంధనలు నవంబర్ 2025 నుంచి అమలుకానున్నాయి. దీంతో వ్యాపారులు తమ వాహనాలను అసలు ధరలో నాలుగో వంతుకే అమ్ముకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ₹6–7 లక్షలు పలికిన లగ్జరీ కార్లు ఇప్పుడు ₹4–5 లక్షలకే దొరుకుతున్నాయి. దీంతో కార్ల యజమానులకు భారీ నష్టం ఎదురవుతోంది.
సెకండ్ హ్యాండ్ కార్ల డీలర్లు ప్రతి కారుకు NOC (No Objection Certificate) తీసుకుని ఇతర రాష్ట్రాలకు అమ్మే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో అధికారుల జాప్యం ఎదురవుతోంది. నవంబర్ 1, 2025 నుంచి EOF నిషేధం మళ్లీ అమలులోకి రానుండటంతో ప్రస్తుతం పాత కారును అమ్మేందుకు ఇది ఉత్తమ అవకాశం. లేకపోతే రీసేల్ వాల్యు మరింతగా పడిపోవచ్చు.