160 కిలోమీటర్ల మైలేజ్.. టీవీఎస్ కొత్త స్కూటీ ఫీచర్లు తెలిస్తే వావ్ అనాల్సిందే. ధర కూడా తక్కువే

Published : Aug 30, 2025, 08:53 AM IST

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీ స్కూటర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఆటో మొబైల్స్ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను తీసుకొస్తున్నాయి. టీవీఎస్ కొత్త స్కూటీని లాంచ్ చేసింది. 

PREV
15
టీవీఎస్ ఆర్బిటర్

టీవీఎస్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్బిటర్ (TVS Orbiter) ను భారత్‌లో విడుదల చేసింది. దీనిని టీవీఎస్ iQube కంటే తక్కువ రేంజ్‌ ఉన్న మోడల్‌గా తీసుకొచ్చారు. రోజువారీ నగర ప్రయాణాలకు అనువుగా ఈ స్కూట‌ర్‌ను లాంచ్ చేశామ‌ని కంపెనీ చెబుతోంది.

DID YOU KNOW ?
స్కూటీ ప్రత్యేకత ఏంటంటే.?
సీటు క్రింద 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉండటం ఈ స్కూటీ ప్రత్యేకత. కంపెనీ చెబుతోన్న వివ‌రాల ప్ర‌కారం సీటు కింద రెండు హెల్మెట్లు ప‌డ‌తాయి.
25
డిజైన్, క‌ల‌ర్స్

ఆర్బిటర్ స్కూటర్‌ను మోడ్ర‌న్ స్టైల్‌తో రూపొందించారు. వెడల్పాటి హ్యాండిల్‌బార్, సూటిగా ఉండే ఫుట్‌బోర్డ్ కారణంగా రైడర్‌కు ఎక్కువ సౌకర్యం ల‌భిస్తుంది. సీటు విశాలంగా ఉండటం వ‌ల్ల‌ రైడర్‌తో పాటు వెన‌కాల కూర్చున్న వ్య‌క్తి సౌకర్యంగా కూర్చోవచ్చు. సీటు క్రింద 34 లీటర్ల స్టోరేజ్ స్పేస్ ఉండటం ఈ స్కూటీ ప్రత్యేకత. కంపెనీ చెబుతోన్న వివ‌రాల ప్ర‌కారం సీటు కింద రెండు హెల్మెట్లు ప‌డ‌తాయి. ఈ స్కూటర్ మొత్తం 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నీయాన్ సన్‌బర్స్ట్, స్ట్రాటోస్ బ్లూ, లూనార్ గ్రే, స్టెల్లర్ సిల్వర్, కాస్మిక్ టిటానియం, మార్షియన్ కాపర్ క‌ల‌ర్స్‌లో తీసుకొచ్చారు.

35
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?

ఆర్బిటర్ స్కూటర్‌లో అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, విశాలమైన బూట్ స్పేస్ ఉన్నాయి.

క‌ల‌ర్స్‌తో కూడిన‌ LCD క్లస్టర్‌లో కాల్స్, మెసేజ్‌లు, నావిగేషన్ అలర్ట్స్ కనిపిస్తాయి.

ప్రత్యేక యాప్‌ ద్వారా క్రాష్ అలర్ట్, జియో-ఫెన్సింగ్, టైమ్-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ నోటిఫికేషన్లు పొందవచ్చు.

ఓవర్-ద-ఎయిర్ (OTA) అప్‌డేట్స్ సపోర్ట్ చేస్తుంది.

రెండు రైడ్ మోడ్‌లు – ఈకో, పవర్ లభిస్తాయి.

తన సెగ్మెంట్‌లో ప్రత్యేకంగా 14-అంగుళాల వీల్స్ ఉన్న ఏకైక స్కూటర్ ఇది.

45
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్

ఆర్బిటర్‌లో 3.1kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. కంపెనీ చెబుతోన్న వివ‌రాల‌ ప్రకారం ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే 158 కి.మీ వరకు ప్రయాణించగలదు (IDC రేంజ్ ప్రకారం). అయితే రియల్-వరల్డ్ రేంజ్ కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది.

55
మోటార్‌, ప‌నితీరు

ఈ స్కూటర్‌లో హబ్ మౌంటెడ్ మోటార్ ఉంటుంది.

ఈకో మోడ్ – ఎక్కువ రేంజ్ అందించడానికి రూపొందించారు.

పవర్ మోడ్ – వేగంగా నడిపేందుకు, ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఓవర్‌టేక్ చేసే సమయంలో తక్షణ శక్తిని ఇస్తుంది.

ధ‌ర ఎంతంటే.?

టీవీఎస్ ఆర్బిటర్‌ను కంపెనీ రూ. 99,900 (ఎక్స్-షోరూమ్, పీఎం e-డ్రైవ్ స్కీమ్‌తో, బెంగళూరు, ఢిల్లీ ధర) వద్ద విడుదల చేసింది. ఈ బ‌డ్జెట్‌లో ఇలాంటి ఫీచ‌ర్లు రావ‌డం విశేషంగా చెప్పొచ్చు. అయితే దీనిని టీవీఎస్ జ్యూపిటర్ ధర పరిధిలోనే తీసుకొచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories