హీరో గ్లామర్ నుంచి కొత్త వేరియంట్.. ఆ ఫీచర్‌తో వ‌చ్చిన ప్ర‌పంచంలోనే తొలి బైక్ ఇదే

Published : Aug 21, 2025, 12:35 PM IST

ప్ర‌ముఖ టూ వీల‌ర్ కంపెనీ హీరో మార్కెట్లోకి కొత్త బైక్‌ను తీసుకొచ్చింది. హీరో గ్లామ‌ర్ ఎక్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్‌లో అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందించారు. ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
హీరో గ్లామర్ X లాంచ్

హీరో మోటోకార్ప్ భారతదేశంలో కొత్త గ్లామర్ X ను లాంచ్ చేసింది. ఇది దేశంలోనే తొలి 125cc కమ్యూటర్ బైక్ కావ‌డం విశేషం. ఈ బైక్‌లో క్రూజ్ కంట్రోల్, రైడ్ మోడ్‌లు వంటి సాంకేతిక ఫీచర్లను అందించారు. ధ‌ర విష‌యానికొస్తే డ్రమ్ వేరియంట్ ధ‌ర రూ.89,999.. డిస్క్ వేరియంట్ ధ‌ర రూ. 99,999 (ఎక్స్-షోరూం, ఢిల్లీ)గా నిర్ణయించారు.

DID YOU KNOW ?
తొలి బైక్ ఇదే
లో బ్యాటరీ కిక్ స్టార్ట్ అనే తొలి ఫీచ‌ర్‌ను కూడా ఈ బైక్‌లోనే తీసుకొచ్చారు.
25
అదిరిపోయే లుక్‌తో

గ్లామర్ X పూర్తిగా కొత్త మస్క్యులర్ లుక్ తో వచ్చింది. షార్ప్ లైన్స్, స్కల్ప్టెడ్ బాడీ వర్క్ బైక్‌కు బోల్డ్ లుక్ ఇస్తాయి. ఆల్ LED లైటింగ్ సిస్టమ్, హై ఇంటెన్సిటీ హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ “H” ఆకారంలో టెయిల్ ల్యాంప్‌ల‌ను ఇచ్చారు. ఇక ఇందులోని పొజిషన్ ల్యాంపులు రాత్రిపూట రైడింగ్‌ను మరింత సురక్షితం చేస్తాయి.

35
ఇంజన్‌, ప‌నితీరు

ఈ బైక్‌లో 124.7cc, 4-స్ట్రోక్, ఎయిర్ కూల్డ్ ఇంజ‌న్‌ను అందించారు. ఈ బైక్ పవర్: 11.4bhp @ 8,250rpm కాగా టార్క్: 10.5Nm @ 6,500rpmగా ఉంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు. ఇంజిన్‌లో బ్యాలెన్సర్ టెక్నాలజీ ఉండటం వల్ల కంపనలు తక్కువగా ఉంటాయి. సైలెంట్ కామ్‌చైన్ వాడటం వల్ల ఇంజిన్ శబ్దం కూడా తగ్గుతుంది. అదనంగా, బాస్ రిచ్ ఎగ్జాస్ట్ నోట్ బైక్‌కు స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. లో బ్యాటరీ కిక్ స్టార్ట్ అనే తొలి ఫీచ‌ర్‌ను కూడా ఈ బైక్‌లోనే తీసుకొచ్చారు.

45
టెక్నాలజీ ఫీచర్లు

గ్లామర్ X తన సెగ్మెంట్‌లో టెక్నాల‌జీకి పెద్ద పీట వేశారు. రైడ్-బై-వైర్ సిస్టమ్ (ఇ-థ్రోటిల్ కంట్రోల్), మొద‌టిసారి 125 సీసీ బైక్‌లో క్రూజ్ కంట్రోల్‌ను ఇవ్వ‌డం విశేషం. ఈకో, రోడ్, పవర్ వంటి మూడు రైడ్ మోడ్‌లు ఇచ్చారు. అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే వెనుక వాహనాలకు వార్నింగ్ ఇచ్చే పానిక్ బ్రేక్ అలర్ట్ ఫీచ‌ర్‌ను అందించారు. నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్స్, మైలేజ్, గేర్ పొజిషన్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, ఆటో బ్రైట్‌నెస్ ఇలా మరెన్నో ఫీచ‌ర్ల‌ను అందించారు.

55
అదనపు ఫీచర్లు

రైడింగ్‌ను సౌకర్యవంతంగా మార్చేందుకు హీరో అనేక మార్పులు చేసింది. 30mm వెడల్పైన హ్యాండిల్‌బార్, అప్రైట్ సిట్టింగ్ పొజిషన్, ఫార్వర్డ్-సెట్ ఫుట్ పెగ్స్, వెన‌కాల కూర్చున్న వ్య‌క్తికి సౌకర్యం కోసం పెద్ద సీట్, మృదువైన కుషనింగ్, బలమైన గ్రాబ్‌రైల్ ఇచ్చారు. సీటు కింద యుటిలిటీ బాక్స్ (టూల్‌కిట్, ఫస్ట్ ఎయిడ్, మొబైల్స్ పెట్టుకునే సౌకర్యం) ఉంది. అలాగే టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్, దృఢమైన నైలాన్ రియర్ గ్రిప్ వంటి అధునాత‌న ఫీచ‌ర్ల‌ను అందించారు.

Read more Photos on
click me!

Recommended Stories