TVS Jupiter: జీఎస్టీ త‌గ్గింపుతో జూపిట‌ర్ ధ‌ర ఎంత త‌గ్గిందంటే.. త‌క్కువ‌ బ‌డ్జెట్‌లో ఇలాంటి ఫీచ‌ర్లు కేక అస‌లు

Published : Oct 09, 2025, 11:40 AM IST

TVS Jupiter: జీఎస్టీ 2.0తో కొన్ని ర‌కాల వ‌స్తువుల ధ‌ర‌లు త‌గ్గిన విష‌యం తెలిసిందే. వీటిలో ఆటో మొబైల్ కూడా ఒక‌టి. మ‌రి జీఎస్టీ త‌గ్గింపు త‌ర్వాత టీవీఎస్ జూపిట‌ర్ స్కూటీ ధ‌ర ఎంత త‌గ్గింది.? ఇంత‌కీ స్కూటీలో ఎలాంటి ఫీచ‌ర్లు ఉన్నాయో తెలుసుకుందాం. 

PREV
15
రూ. 75 వేల‌కే..

GST 2.0 తగ్గింపుతో TVS Jupiter 125 ధర గణనీయంగా తగ్గింది. ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 75,600 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకు లభిస్తుంది. గ‌తంలో ఈ స్కూటీ ధ‌ర రూ. 82,395గా ఉండేది. అంటే ఈ స్కూటీపై సుమారు రూ. 8 వేల వ‌ర‌కు ధ‌ర త‌గ్గింది. రోజువారీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే వారికి ఈ స్కూటీ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. TVS Jupiter 125 నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో డ్రమ్ అల్లాయ్, డిస్క్, స్మార్ట్ ఎక్స్ క‌నెక్ట్ డ్రమ్, స్మార్ట్ ఎక్స్ క‌నెక్ట్ డిస్క్‌. ప్రతి వేరియంట్ వినియోగదారుల అవసరాలు, బడ్జెట్ దృష్ట్యా రూపొందించారు.

25
డిజైన్, ఫీచర్లు

* TVS Jupiter 125 బాడీ స్ట్రాంగ్‌గా డిజైన్ చేశారు. ఇందులోని LED హెడ్‌లైట్లు, టెయిల్‌లైట్లు రాత్రిపూట మెరుగైన విజ‌న్‌ను అందిస్తాయి. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్, ఇంధన గేజ్ వంటి వివరాలు ఉంటాయి.

* SmartXonnect వేరియంట్‌లో TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్టెంట్, కాల్/మెసేజ్ అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

* ఇందులో 33 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంది. ఇందులో రెండు హెల్మెట్‌లు సులభంగా పెట్టుకోవ‌చ్చు. అదనంగా USB ఛార్జర్, 2 లీటర్ల గ్లోవ్ బాక్స్ సౌకర్యం కూడా ఉంది.

35
భ‌ద్ర‌త విష‌యంలో కూడా

పెట్రోల్ ఫిల్ చేయ‌డానికి సీటు తెర‌వాల్సిన ప‌ని లేదు. ఫిల్లింగ్ క్యాప్‌ను బ‌య‌టే ఇచ్చారు. అలాగే సీటు ఓపెనింగ్ స్విచ్, పార్కింగ్ బ్రేక్ సిస్టమ్, సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) లాంటి ఫీచర్లు రైడింగ్‌ను మరింత సురక్షితంగా చేస్తాయి. స్టాండ్ అలారం, ప్రమాద హెచ్చరిక లైట్ వంటి భద్రతా అంశాలు ప్రయాణికుల రక్షణలో ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

45
ఇంజన్, పనితీరు

TVS Jupiter 125లో 124.8cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 8.15 PS పవర్, 10.5 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

BS6-2.0 ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో రావ‌డంతో మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఈ స్కూట‌ర్ గరిష్టంగా గంట‌కు 95 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తుంది.

55
మైలేజ్ ఎంత ఇస్తుందంటే.?

ARAI ప్రమాణాల ప్రకారం Jupiter 125 మైలేజ్ 57.27 kmpl కాగా, వాస్తవ వినియోగంలో సగటున 50 kmpl ఇస్తుంది. 5.1 లీటర్ల ఇంధన ట్యాంక్ ఒకసారి నింపితే దాదాపు 250 కిలోమీటర్ల పరిధి ఇస్తుంది. "Distance to Empty" సూచికతో ఇంధనం అయిపోవడానికి ముందు అలర్ట్ వస్తుంది. ఇక ఈ స్కూటీ ప్ర‌స్తుతం మార్కెట్లో ఉన్న‌.. హోండా యాక్టీవా 125, సుజుకీ యాక్సెస్ 125, హీరో డెస్టినీ 125, య‌మ‌హా ఫ్యాసినో 125 మోడ‌ళ్ల‌కు పోటీనిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories