Electric cycle: రూ. 5 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. పతంజలి మరో సంచలనం.?

Published : May 22, 2025, 02:45 PM ISTUpdated : May 22, 2025, 04:03 PM IST

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఇటీవ‌ల ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈవీ వాహ‌నాల త‌యారీలోకి అడుగుపెడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పతంజ‌లి కూడా ఎల‌క్ట్రిక్ సైకిల్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

PREV
16
ఈవీ రంగంలోకి ప‌తంజలి.?

పతంజ‌లి అనగానే మ‌న‌కు బాబా రాందేవ్, ఆయన చేసే యోగాసనాలతో పాటు ఆ బ్రాండ్‌కు చెందిన వ‌స్తువులు గుర్తొస్తాయి. అయితే ప‌తంజ‌లి బ్రాండ్ నుంచి ఎల‌క్ట్రిక్ సైకిల్ రానుంద‌న్న వార్త ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియదు. 

ఇప్ప‌టి వ‌ర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. నెట్టింట వైర‌ల్ అవుతోన్న స‌మాచారం ప్రకారం ఈ ఎల‌క్ట్రిక్ సైకిల్‌లో ఎలాంటి ఫీచ‌ర్లు ఉండ‌నున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

26
శక్తివంతమైన బ్యాటరీ:

పతంజలి ఎలక్ట్రిక్ సైకిల్‌లో శక్తివంతమైన బ్యాటరీ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సైకిల్ 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు కేవలం 2 గంటల సమయం పడుతుంది.

ఒకసారి ఛార్జ్ చేస్తే 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని స‌మాచారం. రోజువారీ ఉప‌యోగాల‌కు ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెబుతున్నారు.

36
బలమైన మోటార్:

ఇందులో 250 వాట్ల BLDC మోటార్ ఇవ్వ‌నున్నార‌ని, ఇది సైలెంట్‌గా, తక్కువ విద్యుత్‌తో, సాఫీగా పని చేస్తుంద‌ని తెలుస్తోంది. లోక‌ల్‌లో తిర‌గ‌డానికి, కాలేజ్, ఆఫీస్ వంటి షార్ట్ ట్రిప్స్‌కి ఇది బెస్ట్ ఆప్ష‌న్‌గా చెబుతున్నారు.

46
డిజిటల్ ఫీచర్లు:

సైకిల్‌లో డిజిటల్ డిస్‌ప్లే ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఇది బ్యాటరీ స్థితి, వేగం, ప్రయాణించిన దూరం వంటి వివరాలు చూపిస్తుంది. USB ఛార్జింగ్ పోర్ట్ తో మొబైల్ ఫోన్‌ను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్రంట్‌, రియ‌ర్ డిస్క్ బ్రేక్స్‌ను అందించారు. ఆడ్జస్టబుల్ సీటుతో ఎవరైనా సౌకర్యంగా ప్రయాణించవచ్చు.

56
ధ‌ర ఎంత ఉండ‌నుంది.?

నెట్టింట వైర‌ల్ అవుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఈ ఎల‌క్ట్రిక్ సైకిల్ ధ‌ర రూ. 18 వేలుగా ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే దీనిని తొలుత రూ. 5 వేల డౌన్ పేమెంట్‌తో సొంతం చేసుకోవ‌చ్చు. మిగ‌తా మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలో చెల్లించ‌వ‌చ్చని స‌మాచారం.

66
ఎప్పుడు రానుంది.?

దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. అయితే ఈ ఏడాది చివ‌రి నాటికి మార్కెట్లోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్పటివరకు సంస్థ నుంచి ఎలక్ట్రిక్ సైకిల్‌కి సంబంధించి అధికారిక తేదీ విడుదల కాలేదు. మ‌రి సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ఈ చ‌ర్చ‌లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories