ధర రూ. 77 వేలు, మైలేజ్ 65 కిమీలు.. స్టైలిష్ లుక్‌తో అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో కొత్త బైక్

Published : Nov 03, 2025, 11:42 AM IST

Bike: 110సీసీ సెగ్మెంట్‌లో హీరో స్ప్లెండర్‌, బజాజ్ ప్లాటినా వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వడానికి హోండా లివో 2025 రంగంలోకి వచ్చింది. స్టైలిష్ డిజైన్‌, ఎక్కువ మైలేజ్‌, తక్కువ మెయింటెనెన్స్‌తో అందుబాటులో ఉన్న ఈ బైక్ వివ‌రాలు మీకోసం. 

PREV
14
ధరలు, వేరియంట్లు

హోండా లివో 2025 రెండు వేరియంట్లలో లభిస్తుంది.

* డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ₹77,492 (ఎక్స్-షోరూమ్)

* డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర ₹80,059 (ఎక్స్-షోరూమ్)

నగరం, రాష్ట్ర పన్నుల ఆధారంగా ఆన్-రోడ్ ధర కొంత మారవచ్చు. ఫీచర్లను, పనితీరును దృష్టిలో పెట్టుకుంటే త‌క్కువ బ‌డ్జెట్‌లో బైక్ చూసే వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అవుతుంది.

24
ఇంజిన్‌, పనితీరు

హోండా లివో 2025లో 109.51cc సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌-కూల్డ్‌ ఇంజిన్‌ ఉంది. ఇది BS6 ఫేజ్‌ 2B, OBD-2D నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఇంజిన్‌ శక్తి 8.7 bhp కాగా, టార్క్‌ 9.3 Nm అందిస్తుంది. 4-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ మెకానిజంతో ఇది స్మూత్‌ రైడ్‌ను ఇస్తుంది. సైలెంట్ స్టార్ట్‌ ACG మోటార్‌ ఉండడం వల్ల ఇంజిన్‌ వైబ్రేషన్స్‌ తగ్గుతాయి, నగర డ్రైవింగ్‌లో సైలెంట్‌ స్టార్ట్‌ అనుభవం లభిస్తుంది.

34
అద్భుతమైన మైలేజ్‌

హోండా లివో 2025 రియల్‌ డ్రైవింగ్‌లో లీటర్‌కు 60–65 కి.మీ. మైలేజ్‌ ఇస్తుంది. ARAI సర్టిఫైడ్‌ మైలేజ్‌ లీటర్‌కు 60 కి.మీ. గా ఉంది. 9 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో ఈ బైక్ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 600 కి.మీ.లకుపైగా ప్రయాణించగలదు. eSP టెక్నాలజీ ఇంధన వినియోగాన్ని మెరుగుపరచి, లాంగ్‌ రైడ్‌లలో స్మూత్‌ పర్ఫార్మెన్స్‌ అందిస్తుంది.

44
ఫీచర్లు, భద్రతా సదుపాయాలు

* రియల్ టైమ్‌ మైలేజ్‌ సమాచారంతో డిజిటల్‌ ఇన్స్ట్రుమెంట్‌ క్లస్టర్‌.

* ECO ఇండికేటర్, డిస్టెన్స్-టు-ఎంప్టీ, సర్వీస్‌ డ్యూ రిమైండర్, గేర్ పొజిషన్‌ డిస్‌ప్లే

* CBS (కాంబి బ్రేకింగ్ సిస్టమ్),  సైడ్ స్టాండ్‌ ఇంజిన్‌ కట్-ఆఫ్‌

* ఫ్రంట్‌ డిస్క్‌, రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌లు భద్రతను పెంచుతాయి

Read more Photos on
click me!

Recommended Stories