బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది.? సైంటిఫిక్ రీజ‌న్ ఏంటంటే..

Published : Oct 30, 2025, 08:48 AM IST

Bike: కార్ల‌ను త‌ల‌ద‌న్నె ఫీచ‌ర్ల‌తో బైక్‌లు వ‌స్తున్న రోజులివి. అయితే ఏ మోడ‌ల్ బైక్‌లో అయినా సహ‌జంగా క‌నిపించేది వెనుక సీటు ముందు సీటుకంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది. సీట్ డిజైన్ ఇలా ఉండ‌డానికి అస‌లు కార‌ణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
15
బైక్ సీటు ప్రాధాన్య‌త ఏంటి.?

బైక్ మన రోజువారీ ప్రయాణాన్ని చాలా సులభం చేస్తుంది. చిన్న దూరం కావచ్చు లేదా పెద్దదైనా, సౌకర్యంగా ప్రయాణించాలంటే సరైన సీటు డిజైన్ అవసరం. అందుకే బైక్ తయారీదారులు సీటు వెడల్పు, ఎత్తు, కంఫర్ట్‌ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.

25
వెనుక సీటు ఎత్తుగా ఉండటానికి ప్రధాన కారణం

అధిక శాతం బైక్‌లలో వెనుక సీటు ఎత్తుగా ఉంచటం యాదృచ్ఛికం కాదు. ఇది బైక్ బ్యాలెన్స్, డిజైన్ స్ట్రక్చర్‌కు అవసరం. రెండు చక్రాల మధ్య సమతుల్యం ఉండాలంటే, బైక్‌పై కూర్చున్న ఇద్దరి బరువు సరిగ్గా సెంటర్‌లో ఉండాలి.

35
రైడింగ్ బ్యాలెన్స్‌, ఏరోడైనమిక్స్‌

వెనుక సీటు ఎత్తుగా ఉంటే, వెనుక కూర్చున్న వ్యక్తి ముందుకు కొంచెం వంగి కూర్చుంటాడు. దీంతో బరువు బైక్ మధ్య భాగంలో సమంగా పడుతుంది. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీను సరిగా ఉంచి బైక్ డిస్బ్యాలెన్స్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఈ డిజైన్ వల్ల బైక్ మీద గాలి ఒత్తిడి తక్కువగా ఉండి, ప్రయాణం స్మూత్‌గా ఉంటుంది.

45
వెనుక కూర్చున్న వారికి మంచి విజిబిలిటీ

వెనుక సీటు ఎత్తుగా ఉండటం వల్ల వెనుక కూర్చున్న వ్యక్తికి రోడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ముందున్న వ్యక్తి తల లేదా శరీరం అడ్డుగా రాదు. దీని వల్ల ప్రయాణంలో కంఫర్ట్‌ ఫీలవుతుంది, ప్రత్యేకించి లాంగ్ రైడ్స్‌లో ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

55
షాక్‌ అబ్జార్ప్షన్‌, ర‌క్ష‌ణ

ఎత్తైన వెనుక సీటు డిజైన్ వల్ల వెనుక కూర్చున్న వ్యక్తికి రోడ్డుపై వచ్చే గుంత‌ల ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంటుంది. దీనివ‌ల్ల శరీరానికి వచ్చే షాకులు కొంత వరకు తగ్గుతాయి. వెన‌కాల టైర్ గుంత‌లు, స్పీడ్ బ్రేక‌ర్ల పై నుంచి వెళ్లినా దాని ప్ర‌భావం త‌క్కువ‌గా ప‌డుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories