TVS Sport : టీవీఎస్ స్పోర్ట్ బైక్ తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఒక మోడల్. దీన్ని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే నాన్ స్టాప్ గా ఎంతదూరం ప్రయాణించవచ్చో తెలుసా?
రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో మంచి మైలేజ్ ఇచ్చే బడ్జెట్ ప్రెండ్లీ బైక్ కోసం చూస్తున్నారా? అయితే టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport) ఒక మంచి ఎంపిక. జీఎస్టీ తగ్గింపు తర్వాత దీని ధర మరంత తగ్గింది. ప్రస్తుతం టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.55,100 గా ఉంది.
25
రూ.5000 కడితే... బైక్ మీ సొంతం
ఢిల్లీలో దీని ఆన్-రోడ్ ధర రూ.66,948 వరకు ఉంటుంది. అయితే కేవలం రూ.5,000 డౌన్‌పేమెంట్ చెల్లించి 9% వడ్డీతో లోన్ తీసుకుంటే, నెలవారీ ఈఎంఐ రూ.2,185 అవుతుంది. క్రెడిట్ స్కోరు బాగుండేవారికి ఈజీగా లోన్ వస్తుంది.
35
టివిఎస్ స్పోర్ట్ మైలేజ్ ఎంతో తెలుసా?
టివిఎస్ స్పోర్ట్స్ లీటరుకు 70 కి.మీ. పైగా మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్‌తో 700 కి.మీ. ప్రయాణించవచ్చు… అంటే హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు నాన్ స్టాప్ గా రైడ్ చేయవచ్చన్నమాట. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో మంచి సస్పెన్షన్ ఉంది.
టివిస్ స్పోర్ట్స్ 4,500 ఆర్పిఎప్ వద్ద 8.7 ఎన్ఎం రిలీజ్ చేస్తుంది. ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఏవిధంగా చూసుకున్నా టీవిఎస్ స్పోర్ట్స్ హీరో హెచ్ఎఫ్ 100, బజాజ్ సీటీ 110ఎక్స్ వంటి బైక్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.
55
టివిఎస్ స్పోర్ట్ ఈ రంగుల్లో లభ్యం
ప్రస్తుతం టివిఎస్ స్పోర్ట్స్ బ్లాక్ బ్లూ, బ్యాక్ రెడ్, వైట్ పర్పుల్ తో పాటు మెటాలిక్ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది. అలాగే స్ట్రెయిట్ బ్లూ, ఆల్ బ్లాక్, ఆల్ గ్రే, ఆల్ రెడ్ రంగుల్లో కూడా ఇది లభిస్తుంది. దీని అదిరిపోయే ఫీచర్లు, అందమైన లుక్, బడ్జెట్ ఫ్రెండ్లీ మెయింటెనెన్స్ మధ్యతరగతి ఉద్యోగ జీవులకు ఎంతగానో ఆకట్టుకుంటోంది.